వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన టీమిండియా (Team India) ఇప్పుడు మరో సవాల్‌కి సిద్ధమవుతోంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన క్షణం కూడా గడవకముందే, భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరింది.కేవలం 24 గంటల వ్యవధిలోనే ఈ మార్పు జరిగి ఉండటం అభిమానుల్లో విశేష ఆసక్తి రేపుతోంది.
Read Also: Commonwealth Games: 2030 కామన్‌వెల్త్ గేమ్స్ ఆతిథ్యం అహ్మదాబాద్‌కే: జైశంకర్
బుధవారం ఉదయం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ తదితరులు కనిపించారు. వీరందరూ ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కే సమయంలో అభిమానులు, మీడియా వారితో చిన్నపాటి సంభాషణలు జరిపారు. ఆత్మవిశ్వాసంతో ఉన్న ఈ జట్టు ఇప్పుడు మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆసీస్ జట్టుతో తలపడనుంది.
మొదటి వన్డే అక్టోబర్ 19న పెర్త్ వేదికగా జరగనుంది. గిల్ సారథ్యంలో భారత్ ఆడబోతోంది. ఈ సిరీస్‌లో సీనియర్ ప్లేయర్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా జట్టుతో కలిసి పాల్గొనడం జట్టుకు అదనపు బలాన్ని ఇస్తోంది. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ (Shubman Gill) మొదటిసారిగా పూర్తి సిరీస్‌ను నడిపించే అవకాశం రావడంతో ఆయనపై దృష్టి సారించారు. గత కొంతకాలంగా అద్భుత ఫామ్‌లో ఉన్న గిల్ తన బ్యాటింగ్‌తో పాటు లీడర్‌షిప్ స్కిల్స్‌ను కూడా ప్రదర్శించనున్నారు.
కోహ్లీ, రోహిత్‌లకు ఈ సిరీస్ కీలకం
ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్ తర్వాత కోహ్లీ, రోహిత్ మైదానంలోకి బరిలోకి దిగుతుండటం ఇదే తొలిసారి కావడంతో ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వన్డే ప్రపంచకప్ 2027 (ODI World Cup 2027) ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ, రోహిత్‌లకు ఈ సిరీస్ కీలకం కానుంది.
ఈ మూడు వన్డే మ్యాచ్ (ODI match) ల్లో కనబర్చే ప్రదర్శనపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ సిరీస్‌లో విఫలమైతే వారికి వారే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం కూడా ఉందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
జియో మొబైల్ యూజర్లు మాత్రం
ఈ సిరీస్‌కు స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ (Star Sports Network), ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ (Jio hot star) అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ వ్యవహరిస్తున్నాయి. అయితే ఈ రెండు వేదికల్లో మ్యాచ్‌లు చూడాలంటే డబ్బులు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి.

జియో మొబైల్ యూజర్లు మాత్రం ప్రత్యేక రిఛార్జి ప్లాన్స్‌తో జియో హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. ఈ మ్యాచ్‌లు దూరదర్శన్(డీడీ) స్పోర్ట్స్ ఛానెల్‌లో ఉచితంగా ప్రసారం కానున్నాయి.
డీటీహెచ్ సర్వీసుల్లో మాత్రం ఫ్రీగా రాదు
కానీ కేబుల్, డీటీహెచ్ సర్వీసుల్లో మాత్రం ఫ్రీగా రాదు. terrestrial network(భూ ఆదారిత నెట్ వర్క్) కనెక్షన్లలో మాత్రమే డీడీ స్పోర్ట్స్ ఫ్రీగా రానుంది.భారత వన్డే జట్టు:శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.
తొలి వన్డే: అక్టోబర్ 19(ఆదివారం),పెర్త్, ఉదయం 9 గంటలకు,రెండో వన్డే: అక్టోబర్ 23(గురువారం), అడిలైడ్, ఉదయం 9 గంటలకు,మూడో వన్డే: అక్టోబర్ 25(శనివారం), సిడ్నీ , ఉదయం 9 గంటలకు,సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ(కీపర్), వరుణ్ చక్రవర్తీ, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్(కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.
టీ20 షెడ్యూల్.. ఇలా
తొలి టీ20: అక్టోబర్ 29(బుధవారం),కాన్‌బెర్రా, మధ్యాహ్నం 1.45 గంటలకు,రెండో టీ20: అక్టోబర్ 31(శుక్రవారం), మెల్‌బోర్న్, మధ్యాహ్నం 1.45 గంటలకు,మూడో టీ20: నవంబర్ 2(ఆదివారం), హోబర్ట్ , మధ్యాహ్నం 1.45 గంటలకు,నాలుగో టీ20: నవంబర్ 6(గురువారం), గోల్డ్ కోస్ట్ , మధ్యాహ్నం 1.45 గంటలకు,ఐదో టీ20: నవంబర్ 8(శనివారం), బ్రిస్బేన్, మధ్యాహ్నం 1.45 గంటలకు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: