టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) చుట్టూ ప్రస్తుతం ఐపీఎల్ ప్రపంచంలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. బౌలింగ్‌లో ఆఫ్ స్పిన్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ తన ప్రతిభను నిరూపించుకున్న ఈ యువ క్రికెటర్ కోసం పలు ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్‌కింగ్స్ (CSK) తన స్వస్థలం తమిళనాడుకు చెందిన సుందర్‌ను జట్టులోకి తీసుకోవాలనే ఆలోచనతో ముందుకు వచ్చింది. తమ “లోకల్ బాయ్” కోసం సీఎస్కే నిర్వహించిన ప్రయత్నాలు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి.
Read Also: Sri Charani: నా ఫేవరేట్ క్రికెటర్ అతనే: శ్రీచరణి
కానీ, వాషింగ్టన్‌ను ఇచ్చేందుకు గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) మెంటార్ ఆశిష్ నెహ్రా ససేమిరా అన్నాడని క్రిక్‌బజ్ పేర్కొంది.కొన్ని వారాల క్రితం యూట్యూబ్ ఛానెల్‌లో “సుందర్ చెన్నైకి వస్తున్నాడు” అనే వార్త వెలువడింది. అది పూర్తిగా అబద్ధం కాకపోయినా, ఇప్పుడు ఆ అవకాశాలు పూర్తిగా లేనట్టే అని చెప్పొచ్చు.
చెన్నై సూపర్ కింగ్స్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) పై ఆసక్తి చూపినప్పటికీ, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా ఆ ట్రేడ్‌ను పూర్తిగా తిరస్కరించారని క్రిక్‌బజ్ స్పష్టం చేసింది.గుజరాత్ యాజమాన్యం సుందర్‌ను వదిలే ఉద్దేశం తమకు లేదని చెన్నైకి ముందుగానే తెలిపిందట. ఈ నిర్ణయం సుందర్ ఆస్ట్రేలియాపై హోబార్ట్‌లో చేసిన అద్భుత ఇన్నింగ్స్‌కి ముందే తీసుకున్నదని సమాచారం.

వాషింగ్టన్ ప్లేస్ కూడా ఫిక్సయింది
ఆ మ్యాచ్‌లో వాషింగ్టన్ బ్యాటింగ్ చూసిన తర్వాతే.. వదులుకోవద్దని డిసైడ్ అయ్యి ఉంటారనే అనుమానాలూ కలుగుతున్నాయి. అప్పటి దాకా ఏమైనా అనుమానాలు ఉన్నా సరే.. అలాంటి ఇన్నింగ్స్ సీజన్ మొత్తంలో 3-4 ఆడినా చాలు కదా అనే భావనకు గుజరాత్ మేనేజ్‌మెంట్ వచ్చి ఉంటుంది. పైగా వాషింగ్టన్ పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేయగలడు.
దూకుడుగా ఆడటంతోపాటు వికెట్ ఇవ్వకుండా బ్యాటింగ్ చేయగల సమర్థుడు కావడంతో సుందర్‌ని వదులుకోవడానికి నెహ్రా వెనకడుగు వేసి ఉంటాడు.గుజరాత్ టైటాన్స్ తరఫున అద్భుత ప్రదర్శనలు ఇచ్చిన తర్వాత టీమిండియాలో వాషింగ్టన్ ప్లేస్ కూడా ఫిక్సయింది.
అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో రాణిస్తూ మంచి ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. టీ20లతో పాటు టెస్టు ఫార్మాట్‌లో కూడా టీమిండియా కీలక ఆటగాడిగా మారిపోయాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో రవీంద్ర జడేజాతో పాటు మరో స్పిన్ ఆల్‌రౌండర్‌గా మారిపోయాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: