దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో టీమిండియా పేలవ ప్రదర్శనపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సోదరుడు వికాస్ కోహ్లి (Vikas Kohli) సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది. జట్టు మేనేజ్‌మెంట్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ను పరోక్షంగా లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పటిష్ఠంగా ఉన్న జట్టును బలవంతంగా మార్చడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు.
Read Also: Palash Muchhal: వదంతులను కొట్టి పారేసిన పలాష్ తల్లి అమితా ముచ్చల్
దక్షిణాఫ్రికా ప్రొఫెషనల్ వ్యూహంతో ఆడుతోంది
గువాహటి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో భారత్ ఓటమి అంచున నిలిచిన నేపథ్యంలో వికాస్ (Vikas Kohli) స్పందించారు. “ఒకప్పుడు విదేశాల్లో విజయాల కోసం ఆడేవాళ్లం. ఇప్పుడు మన సొంత గడ్డపైనే మ్యాచ్‌ను కాపాడుకోవడానికి పోరాడుతున్నాం. అంతా బాగున్న వ్యవస్థను బలవంతంగా మార్చాలని చూస్తే ఇలాగే ఉంటుంది” అని తన పోస్టులో పేర్కొన్నారు.భారత జట్టు వ్యూహాలను కూడా ఆయన తప్పుబట్టారు.
అనుభవం ఉన్న సీనియర్ ఆటగాళ్లను, మిడిల్ ఆర్డర్‌లో నిలకడగా రాణించే 3, 4, 5 స్థానాల బ్యాటర్లను పక్కనపెట్టారని విమర్శించారు. బౌలర్లను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపడం, అవసరానికి మించి ఆల్‌రౌండర్లను ఆడించడం వంటి ప్రయోగాలపై అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం స్పెషలిస్ట్ బ్యాటర్లు, బౌలర్లతో ప్రొఫెషనల్ వ్యూహంతో ఆడుతోందని తెలిపారు.
గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి టెస్టుల్లో టీమిండియా ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో, విదేశాల్లో ఆస్ట్రేలియాతో సిరీస్‌లు కోల్పోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (Rohit Sharma, Virat Kohli) రిటైర్మెంట్ తర్వాత బ్యాటింగ్ లైనప్ బలహీనపడింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో సిరీస్‌లోనూ భారత్ వెనుకబడింది. ఈ నేపథ్యంలో వికాస్ కోహ్లి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: