క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) నూతన సంవత్సరం సందర్భంగా తన భార్య అనుష్క శర్మతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఫొటోకు సెలబ్రేషన్స్ ఎమోజీని జత చేశాడు. “నా జీవిత భాగస్వామితో 2026లోకి అడుగుపెడుతున్నాను” అంటూ కోహ్లీ (Virat Kohli) షేర్ చేసిన ఈ పోస్ట్‌కు గంటలోపే దాదాపు 40 లక్షల లైక్స్ రావడం విశేషం. 2025కి ఇది కోహ్లీ చేసిన చివరి పోస్ట్ కావడంతో, అభిమానుల్లో మరింత ఆసక్తి రేపింది.
Read also: Sikander Raza: జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా సోదరుడు మృతి
క్వాలిటీ టైమ్
ప్రస్తుతం క్రికెట్‌కు కొద్దిపాటి విరామం తీసుకున్న కోహ్లీ, త్వరలోనే మళ్లీ మైదానంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. కుటుంబంతో క్వాలిటీ టైమ్ గడిపిన అనంతరం, కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీతో పాటు భారత్ – న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం అందుబాటులోకి రానున్నాడు.
జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌పై ఇప్పటికే క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. కోహ్లీ, అనుష్కల ప్రేమ ఒక వాణిజ్య ప్రకటన సమయంలో మొదలైంది. 2017 డిసెంబరులో వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2021లో వారికి కుమార్తె జన్మించగా, 2024లో కుమారుడు జన్మించాడు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: