IND vs SA : విరాట్ కోహ్లీ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని రాశాడు. రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో తన 52వ వన్డే సెంచరీ బాది, లెజెండరీ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. ఈ ఘనతతో కోహ్లీ వన్డే క్రికెట్‌లో మరోసారి తన అగ్రస్థానాన్ని నిరూపించుకున్నాడు.
టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న కోహ్లీపై ఇటీవల కొన్ని విమర్శలు వచ్చినా, వాటికి మైదానంలోనే బలమైన సమాధానం చెప్పాడు. 120 బంతుల్లో 135 పరుగులు చేసిన కోహ్లీ ఇన్నింగ్స్ భారత్‌కు భారీ స్కోర్ దిశగా బాట వేసింది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కూడా కీలక పాత్ర పోషించడంతో భారత్ 350కు పైగా స్కోర్ చేసింది.
Breaking News – Liquor Sale : రెండేళ్లలో తెలంగాణ లో రూ.71,500 కోట్ల మద్యం తాగేశారు..ఓరి దేవుడా !!
కోహ్లీ రికార్డు ఇన్నింగ్స్‌పై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పెద్ద ప్రశంసలు కురిపించారు.
“విరాట్‌కి వ్యతిరేకంగా, తోడు ఆడినవాళ్లంతా అతడే వన్డే క్రికెట్‌లో (IND vs SA) అత్యుత్తమ ఆటగాడు అని ఒప్పుకుంటారు. రికీ పాంటింగ్ కూడా అతడిని GOAT గా పేర్కొన్నాడు. ఆస్ట్రేలియన్ల నుంచి ప్రశంస రావడం చాలా కష్టం. సచిన్‌ను అధిగమించాక అతడి స్థాయి ఎక్కడుందో అర్థమవుతుంది” అని గవాస్కర్ వ్యాఖ్యానించారు.
ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ సాధించిన క్షణంలో ఓ అభిమాని మైదానంలోకి వచ్చి అతడి పాదాలను తాకాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతడిని మైదానం బయటకు తరలించారు.
వన్డేల్లో అద్భుత ఫామ్ కొనసాగిస్తున్న కోహ్లీ 2027 వరల్డ్ కప్ అనంతరం కెరీర్ ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/