
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, రెండో టీ20కి ముందు మాజీ క్రికెటర్, కామెంటేటర్ మురళీ కార్తిక్‌తో గొడవపడినట్లు తెలుస్తోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు హార్దిక్ పాండ్యా ప్రాక్టీస్ కిట్ ధరించి, చేతిలో బ్యాట్ పట్టుకుని వార్మప్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మైదానంలో కామెంటరీ విధుల్లో ఉన్న మురళీ కార్తీక్ అక్కడికి రావడంతో ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య మాటలు సాధారణంగా సాగలేదని.. ఏదో విషయంలో వాగ్వాదం జరిగిందని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Read Also: IND vs AUS Test: ఆస్ట్రేలియాతో టెస్ట్.. భారత జట్టు ప్రకటన
అసలు వివాదం ఏమిటి?
వైరల్ అవుతున్న వీడియో (Viral Video) లో మురళీ కార్తీక్ ఏదో వివరిస్తూ హార్దిక్ పాండ్యాను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యా బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆయన కొంత సీరియస్‌గా ఉన్నట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియోను ప్రేక్షకులు స్టాండ్స్ నుంచి రికార్డ్ చేయడంతో అందులో మాటలు ఏవీ వినిపించడం లేదు. కేవలం మైదానంలోని సందడి మాత్రమే వినిపిస్తోంది. కాబట్టి వారి మధ్య నిజంగానే గొడవ జరిగిందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: