IPL 2025 ట్రోఫీని Royal Challengers Bangalore (RCB) గెలుచుకున్న నేపథ్యంలో, ఆ జట్టుకు ఆరంభ కాలంలో మద్దతుగా ఉన్న విజయ్ మాల్య (Vijay Mallya) విషెష్ అందించారు. “ఎట్టకేలకు IPL ట్రోఫీ బెంగళూరుకు వచ్చింది. ఇది నా కల. ఆ కల నెరవేర్చిన RCB ఆటగాళ్లకు, టీమ్ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అభిమానులు ఎంతో ప్రత్యేకం. వాళ్లు ఈ కప్పుకు అర్హులు. ఈ సాలా కప్ బెంగళూరు నామదే !” అంటూ మాల్య తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
మీరు ఇండియా కు ఎప్పుడు వస్తారు
తన వ్యాఖ్యలతో RCB అభిమానులు కొంత ఉత్సాహం వ్యక్తం చేసినా, నెటిజన్ల నుండి మాత్రం వినోదాత్మక సెటైర్లు రావడం ప్రారంభమైంది. “కప్పు వచ్చిందిది నిజమే కానీ, ఇప్పుడు మీరు ఇండియా వచ్చి సెలబ్రేట్ చేయండి” అని కొందరు సూచించగా, “SBI కల కూడా నెరవేర్చాలి సార్” అంటూ మరికొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పలు ట్వీట్లలో విజయ్ మాల్యకి వ్యతిరేకంగా పోస్టులు వెలువడుతున్నాయి.
విజయ మాల్యా పై కేసులు
విజయ్ మాల్య గతంలో RCBకి ప్రొమోటర్‌గా వ్యవహరించినప్పటికీ, బ్యాంకులకు భారీగా బకాయిలు ఉండటంతో ఆయన విదేశాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయనపై భారత ప్రభుత్వానికి, బ్యాంకులకు అప్పు రికవరీ విషయమై కేసులు నడుస్తున్నాయి. అలాంటి సమయంలో మాల్య IPL విజయం గురించి స్పందించడాన్ని నెటిజన్లు హాస్యంగా, వ్యంగ్యంగా తీసుకుంటున్నారు.
Read Also : Gandhi Bhavan : గాంధీ భవన్ కు భద్రత పెంపు.. కారణమా అదేనా ?