భారత మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ (Venkatesh Prasad) కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థి కె.ఎన్. శాంతకుమార్‌పై 191 ఓట్ల తేడాతో గెలిచారు. ప్రసాద్ మొత్తం 749 ఓట్లు పొందగా, శాంతకుమార్ 558 ఓట్లు సాధించాడు.
Read Also: Messi: ఉప్పల్‌లో మెస్సీ మ్యాచ్.. ఏర్పాట్లపై భట్టి సమీక్ష

ఆర్సీబీ మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియంలోనే జరుగుతాయి
చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ మ్యాచ్‌లు నిర్వహిస్తామంటూ వెంకటేశ్ ప్రసాద్ (Venkatesh Prasad) స్పష్టం చేశాడు.అదే ఎన్నికల్లో మాజీ క్రికెటర్ సుజిత్ సోమసుందర్ ఉపాధ్యక్షుడిగా, సంతోష్ మీనన్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2019 – 2022 మధ్య ఇదే పదవిలో పనిచేసిన సంతోష్ మళ్లీ బాధ్యతలు చేపట్టనున్నారు.
మాజీ అంపైర్ బీకే రవి జాయింట్ సెక్రటరీగా, బీఎన్ మధుకర్ ట్రెజరర్‌గా ఎన్నుకున్నారు.33 టెస్టులు, 161 వన్డేలు ఆడిన ప్రసాద్ గతంలో 2010 – 2013 మధ్య కేఎస్‌సీఏ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: