ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan), దేశవాళీ క్రికెట్‌లో భారీగా రన్స్ చేస్తున్నా నిరాశే ఎదురవుతోంది. విజయ్ హజారే ట్రోఫీలో గోవాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 75 బంతుల్లోనే 157 చేసి సంచలనం సృష్టించాడు. నిలకడగా రాణిస్తున్నప్పటికీ అతడికి టీమ్ ఇండియాలో చోటు దక్కకపోవడంపై మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ అసహనం వ్యక్తం చేశారు.ఓ జాతీయ మీడియా సంస్థతో వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అవకాశం వచ్చినప్పుడు సర్ఫరాజ్ (Sarfaraz Khan)అద్భుతంగా ఆడాడని, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైనా ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం ఇవ్వలేదని గుర్తుచేశాడు. ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నాడు.
Read also: Virat Kohli: న్యూ ఇయర్.. కొత్త ఫొటోను షేర్ చేసిన క్రికెటర్

తీవ్రంగా విమర్శలు
అన్ని ఫార్మాట్లకు తగ్గట్టుగా తన ఆటను మార్చుకోగల సత్తా ఉన్న ఆటగాడిని ఇలా విస్మరించడం నిజంగా సిగ్గుచేటని తీవ్రంగా విమర్శించాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నా, భారత జట్టులో అరంగేట్రం చేసిన సిరీస్‌లో మంచి ప్రదర్శన చేసినా.. సర్ఫరాజ్‌కు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంపై క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాజీ దిగ్గజం వెంగ్‌సర్కార్ వ్యాఖ్యలతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: