భారత మాజీ పేసర్ వరుణ్ ఆరోన్ (Varun Aaron) ను సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) 2026 ఐపీఎల్ సీజన్ కోసం తమ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. 2025లో ప్రదర్శన తర్వాత, జట్టు బలంగా తిరిగి రాణించేలా పునర్నిర్మాణ చర్యలలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
డేల్ స్టెయిన్ తర్వాత… ఫ్రాంక్లిన్ కూడా ఫెయిల్యూర్
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా ప్రఖ్యాత పేసర్ డేల్ స్టెయిన్ తప్పుకున్న తర్వాత న్యూజిలాండ్ ఎడమచేతి వాటం మాజీ పేసర్ జేమ్స్ ఫ్రాంక్లిన్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అతని హయాంలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మరో మార్పుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో తాజాగా కొత్త బౌలింగ్ కోచ్‌గా మాజీ భారత్ పేసర్ వరుణ్ (Varun Aaron) ను నియమించింది.

ఆటగాడిగా వరుణ్ కెరీర్
భారత జట్టుకు టెస్ట్ & వన్డేల్లో ప్రాతినిధ్యం 2011 నుంచి 2015 మధ్య కాలంలో వరుణ్ ఆరోన్ (Varun Aaron) భారత జాతీయ జట్టుకు తొమ్మిది టెస్టులు, 9 వన్డే మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించారు. అత్యధిక వేగంతో బౌలింగ్ చేయగలగే గుణంతో గుర్తింపు పొందిన ఆయన, దేశవాళీ క్రికెట్‌లో జార్ఖండ్ తరపున ఆడారు. చివరిసారిగా గోవాపై విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో బరిలోకి దిగారు.
కామెంటేటర్‌గా మెప్పించిన వరుణ్
ఇటీవలి కాలంలో వరుణ్ ఆరోన్ కామెంటరీ బాక్స్‌లో కనిపిస్తూ, తన విశ్లేషణాత్మక క్రికెట్ జ్ఞానంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కోసం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సమయంలోనే, SRH అతన్ని బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసినట్టు అధికారిక ప్రకటన వెలువడింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: India Cricket Team : డబ్ల్యూటీసీ జాబితాలో నాలుగో స్థానానికి భారత్