నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అదరగొడుతున్నాడు. యూత్ వన్డేల్లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును బద్దలుకొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన యూత్ వన్డేలో కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి,
Read also: World Tour circuit in 2026: ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్
వర్షం కారణంగా
ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బెనోనిలో దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరిగిన రెండో యూత్ వన్డేలో ఈ అద్భుతం జరిగింది.. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన వైభవ్ (Vaibhav Suryavanshi), ఆరంభం నుంచే విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తం 24 బంతులు ఎదుర్కొని 10 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 68 పరుగులు చేశాడు.

అతని స్కోరులో 64 పరుగులు బౌండరీల ద్వారానే రావడం విశేషం. గతంలో రిషభ్ పంత్ 18 బంతుల్లో ఈ ఫీట్ సాధించగా, వైభవ్ దానిని అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో వర్షం కారణంగా భారత్‌కు 27 ఓవర్లలో 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. లక్ష్య ఛేదనలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్, దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతను ఔటైన తర్వాత వేదాంత్ త్రివేది (31 నాటౌట్), అభిగ్యాన్ కుందు (48 నాటౌట్) నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: