हिन्दी | Epaper
నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు

Under-19 Asia Cup: టాస్ గెలిచిన భారత్

Anusha
Under-19 Asia Cup: టాస్ గెలిచిన భారత్

ఆదివారం వచ్చిందంటే చాలు క్రికెట్ ప్రేమికులకు పండగే. అది కూడా భారత్-పాకిస్థాన్ జట్లు ఫైనల్‌లో తలపడుతున్నాయంటే ఆ మజానే వేరు. దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ 2025 (Under-19 Asia Cup) ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టోర్నీలో భారత్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరగా, పాకిస్థాన్ కూడా కీలక మ్యాచ్‌లలో సత్తా చాటింది.

Read Also: Gavaskar: వరల్డ్ కప్ లో గిల్ కు దక్కని చోటు.. గవాస్కర్ ఏమన్నారంటే?

(Under-19 Asia Cup) ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. భారత్ మరోసారి ట్రోఫీని దక్కించుకుంటుందా లేక పాకిస్థాన్ సంచలనం సృష్టిస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. తుది జట్లలో భారత్ తరపున ఆయుష్ మాత్రే (కెప్టెన్), పాకిస్థాన్ తరపున ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్) నాయకత్వం వహిస్తున్నారు.ఈ టోర్నీలో భారత జట్టు ప్రస్థానం అజేయంగా సాగుతోంది. గ్రూప్ దశలో పాకిస్థాన్‌తో జరిగిన పోరులో భారత్ ఇప్పటికే 90 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అంటే ఈ టోర్నీలో పాక్ ఇప్పటికే భారత్ చేతిలో దెబ్బతింది.

పాకిస్థాన్ కూడా సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచి ఫైనల్ చేరినప్పటికీ, టీమిండియాతో పోలిస్తే వారి ఆత్మవిశ్వాసం కొంచెం తక్కువేనని చెప్పాలి. ఎందుకంటే గ్రూప్ స్టేజ్‌లో మన కుర్రాళ్లు వారిని ముప్పుతిప్పలు పెట్టారు.ముఖ్యంగా 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ మీద అందరి కళ్లు ఉన్నాయి. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై కేవలం 5 పరుగులకే అవుట్ అయిన వైభవ్, ఈ ఫైనల్‌లో ఆ కసితీర్చుకోవాలని చూస్తున్నాడు.

Under-19 Asia Cup: India win the toss
Under-19 Asia Cup: India win the toss

హై-వోల్టేజ్ మ్యాచ్‌

ఈ టోర్నీలో ఇప్పటికే 235 పరుగులు చేసిన వైభవ్, భారత్ తరపున టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. పాక్ బౌలర్లను ఒక ఆటాడుకోవడానికి ఈ చిచ్చరపిడుగు సిద్ధమైపోయాడు. కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ఫామ్ కొంచెం ఆందోళన కలిగిస్తున్నా, విహాన్ మల్హోత్రా, ఆరోన్ జార్జ్ వంటి వారు బ్యాటింగ్‌లో అదరగొడుతున్నారు. బౌలింగ్ విభాగంలో కనిష్క్ చౌహాన్ తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు.

కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో కూడా కనిష్క్ వికెట్లు తీస్తే భారత్ విజయం నల్లేరుపై నడకే. ఓ వైపు భారత్ తన 9వ టైటిల్ కోసం చూస్తుంటే, పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకోవాలని ఆరాటపడుతోంది. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో గెలిచి ఆసియా కప్‌ను ముద్దాడేది మన కుర్రాళ్లేనని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870