हिन्दी | Epaper

న్యూజిలాండ్ చేత పాకిస్తాన్ కు 5 వికెట్ల పరాజయం.

Anusha
న్యూజిలాండ్  చేత పాకిస్తాన్ కు 5 వికెట్ల పరాజయం.

పాకిస్తాన్ వేదికగా ట్రై-నేషన్స్ సిరీస్ జరుగుతున్ననేపథ్యం లో న్యూజిలాండ్ పాకిస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో ఫైనల్లో ఘన విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో న్యూజిలాండ్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. బౌలర్ విల్ ఓ’రూర్కే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో నాలుగు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించగా, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ అర్ధ సెంచరీలతో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు.మంగళవారం జరిగిన ఈ హోరాహోరీ పోరులో పాకిస్తాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 49.3 ఓవర్లలో 242 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయినప్పటికీ, మహ్మద్ రిజ్వాన్ (46), సల్మాన్ ఆఘా (45), తయ్యబ్ తాహిర్ (38) పాక్ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించేందుకు ప్రయత్నించారు. కానీ న్యూజిలాండ్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ భారీ స్కోరు చేయలేకపోయింది. విల్ ఓ’రూర్కే (4/43), మిచెల్ సాంట్నర్ (2/20), మైఖేల్ బ్రేస్‌వెల్ (2/38) కీలక వికెట్లు తీయడంతో పాక్ జట్టు కష్టాల్లో పడింది.

new zealand

243 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఛేజింగ్ ఆరంభంలో కాస్త కష్టాల్లో పడింది. ఓపెనర్ విల్ యంగ్ తక్కువ స్కోరుకే ఔటవ్వగా, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (34), డెవాన్ కాన్వే (48) ఇద్దరూ రెండో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం అందించి జట్టును గాడిలో పెట్టారు. అనంతరం డారిల్ మిచెల్ (57), టామ్ లాథమ్ (56) శతక భాగస్వామ్యంతో జట్టును విజయ దిశగా నడిపించారు. చివర్లో గ్లెన్ ఫిలిప్స్ (20 నాటౌట్) విజయం ఖరారు చేశారు. న్యూజిలాండ్ జట్టు 45.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసి టైటిల్‌ను సాధించింది.మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ, “280కి పైగా స్కోరు చేయాలని అనుకున్నాం. కానీ న్యూజిలాండ్ బౌలర్లు కట్టడి చేశారు. నా వికెట్ కీలకమైన సమయంలో కోల్పోవడం నిర్ణాయకంగా మారింది” అని పేర్కొన్నారు.

కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ మాట్లాడుతూ

“ఇది మాకు మంచి విజయమే. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఇది మాకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మేము విభిన్న పరిస్థితుల్లో ఎలా రాణించగలమో ఈ మ్యాచ్‌లో ప్రదర్శించాం. కానీ అసలైన పరీక్ష బుధవారం ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది” అని చెప్పారు.విజయంతో న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్లలో ఉత్సాహం నెలకొంది. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇదే ఫార్మ్ కొనసాగిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆటగాళ్ల వ్యక్తిగత ఫార్మ్, బౌలింగ్ లైనప్ క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టు భవిష్యత్ ప్రదర్శనపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కేటీఆర్ చేతుల మీదుగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం!

కేటీఆర్ చేతుల మీదుగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం!

అహ్మదాబాద్‌లో టికెట్ల బ్లాక్ దందా.. ఇద్దరు అరెస్ట్!

అహ్మదాబాద్‌లో టికెట్ల బ్లాక్ దందా.. ఇద్దరు అరెస్ట్!

టీమిండియానే ఫేవరెట్.. కానీ! ట్రోఫీ గెలుస్తుందని గ్యారెంటీ లేదు

టీమిండియానే ఫేవరెట్.. కానీ! ట్రోఫీ గెలుస్తుందని గ్యారెంటీ లేదు

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

నేడే ఫైనల్.. విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?

నేడే ఫైనల్.. విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?

భారత్-కివీస్ టీ20 ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే

భారత్-కివీస్ టీ20 ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే

వరుణ్‌పై ఆందోళన వద్దు, అతడు వరల్డ్ నంబర్ 1: సూర్య

వరుణ్‌పై ఆందోళన వద్దు, అతడు వరల్డ్ నంబర్ 1: సూర్య

ఫైనల్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం ప్రత్యేకమైన అనుభూతి

ఫైనల్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం ప్రత్యేకమైన అనుభూతి

ఫైనల్ ముందు షాక్? సూర్య రిటైర్మెంట్ వార్తలు

ఫైనల్ ముందు షాక్? సూర్య రిటైర్మెంట్ వార్తలు

ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్ హోటల్ రేట్లకు రెక్కలు

ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్ హోటల్ రేట్లకు రెక్కలు

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు, భారత్ vs న్యూజిలాండ్

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు, భారత్ vs న్యూజిలాండ్

ఆస్ట్రేలియా ఆలౌట్

ఆస్ట్రేలియా ఆలౌట్

📢 For Advertisement Booking: 98481 12870