Tilak Varma injury : భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి మూడు టీ20 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. పొట్ట భాగంలో ఏర్పడిన సమస్య కారణంగా రాజ్‌కోట్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నట్లు బీసీసీఐ గురువారం అధికారికంగా వెల్లడించింది.
బుధవారం ఉదయం తిలక్ వర్మకు అకస్మాత్తుగా పొట్టలో తీవ్రమైన నొప్పి రావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా, తక్షణమే శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. దీంతో అదే రోజు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. గురువారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తిలక్, శుక్రవారం హైదరాబాద్‌కు తిరిగి వెళ్లనున్నారు.
ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నాడని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. పూర్తిగా నొప్పులు తగ్గి, గాయం మానిన (Tilak Varma injury) తర్వాతే ఫిజికల్ ట్రైనింగ్ ప్రారంభిస్తారని, అనంతరం స్కిల్ ట్రైనింగ్‌కు అనుమతిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో పురోగతిని బట్టి చివరి రెండు టీ20 మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడో లేదో నిర్ణయిస్తామని తెలిపారు.
Read also: Mohammed Shami: న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమైన షమీ..
ఈ గాయంతో ఫిబ్రవరి 7న ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో (అమెరికాతో) తిలక్ వర్మ ఆడే అవకాశాలపై అనుమానాలు నెలకొన్నాయి. ఆ తర్వాత భారత్ నమీబియా (ఫిబ్రవరి 12), పాకిస్థాన్ (ఫిబ్రవరి 15), నెదర్లాండ్స్ (ఫిబ్రవరి 18)తో గ్రూప్ మ్యాచ్‌లు ఆడనుంది.

టీ20 ఫార్మాట్‌లో తిలక్ వర్మ కీలక ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు 37 ఇన్నింగ్స్‌ల్లో 1,183 పరుగులు చేసి సగటు 49.29 నమోదు చేశాడు. రెండు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. అతడి గైర్హాజరీతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నంబర్-3 స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.
న్యూజిలాండ్‌తో తొలి మూడు టీ20లు జనవరి 21, 23, 25 తేదీల్లో నాగ్‌పూర్, రాయ్‌పూర్, గువాహటిలో జరగనున్నాయి. తిలక్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని ఇంకా ప్రకటించలేదు. చివరి రెండు మ్యాచ్‌లు విశాఖపట్నం, తిరువనంతపురంలో జరగనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: