టీమిండియా యువ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఛేజింగ్ సమయంలో అత్యధిక సగటు కలిగిన బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉన్న భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ (Tilak Varma) రికార్డును తిలక్ వర్మ బద్దలు కొట్టడం విశేషం.ఛేజింగ్‌లో 500 పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో తిలక్ వర్మ 68 సగటుతో అగ్రస్థానంలో నిలిచాడు. 16 టీ20ల్లో ఛేజింగ్ చేసిన తిలక్ వర్మ 543 పరుగులు చేశాడు.
Read Also: Abhishek Sharma: ప్రపంచకప్‌లో వాళ్లే గెలిపిస్తారు: అభిషేక్ శర్మ
అత్యధిక యావరేజ్ కలిగిన బ్యాటర్‌గా
విరాట్ కోహ్లీ 48 టీ20ల్లో ఛేజింగ్ చేసి 2013 పరుగులు నమోదు చేశాడు.ఈ జాబితాలో తిలక్ వర్మ తర్వాత విరాట్ కోహ్లీ(67.1 సగటు), మహేంద్ర సింగ్ ధోనీ(47.71), జేపీ డుమినీ(45.55), కుమార సంగక్కర(44.93) తర్వాతి స్థానంలో ఉన్నారు. సౌతాఫ్రికాతో ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ 25 పరుగులతో అజేయంగా నిలిచి ఈ ఫీట్ సాధించాడు. తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్‌తో సౌతాఫ్రికాతో, జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది.టీ20ల్లో ఒక జట్టుపై అత్యధిక యావరేజ్ కలిగిన బ్యాటర్‌గానూ తిలక్ వర్మ నిలిచాడు.

కనీసం 300 పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సౌతాఫ్రికాపై తిలక్ వర్మ 70.50 సగటుతో టాప్‌లో ఉన్నాడు. పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ 70.28, శ్రీలంకపై విరాట్ కోహ్లీ 67.8, వెస్టిండీస్‌పై కేఎల్ రాహుల్ 58.83, వెస్టిండీస్‌పై విరాట్ కోహ్లీ 57 సగటుతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌లో తిలక్ వర్మ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో 113 పరుగులు చేశాడు. ఇందులో 62 పరుగులతో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: