టీ20 వరల్డ్ కప్–2026 (T20 World Cup 2026) కు సంబంధించి న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్ జట్టుకు స్పిన్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ నాయకత్వం వహించనున్నాడు.మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు బుధవారం ఉదయం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.
Read Also: IND vs NZ: శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ.. తొలి వన్డేకు భారత్ సిద్ధం
జట్టు
ఈసారి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2026) ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక వేదికలుగా జరగనుంది. టోర్నీకి ముందుగా న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది.ఈ నెల 11 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భారత జట్టుతో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. టీ20 వరల్డ్ కప్ గ్రూప్ దశలో న్యూజిలాండ్ జట్టు కీలక మ్యాచ్‌లకు సిద్ధమవుతోంది.
జట్టు: శాంట్నర్(C), ఫిన్ అలెన్, బ్రేస్‌వెల్, చాప్‌మన్, కాన్వే, డఫీ, ఫెర్గూసన్, హెన్రీ, మిల్నే, మిచెల్, నీషమ్, ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, సీఫర్ట్, సోధి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: