हिन्दी | Epaper
టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌నకు ఆఫ్ఘ‌నిస్థాన్ జట్టు ఇదే!

Anusha
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌నకు ఆఫ్ఘ‌నిస్థాన్ జట్టు ఇదే!

భారత్, శ్రీలంక వేదికలుగా 2026 ఫిబ్రవరిలో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2026) కు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) తమ జట్టును అధికారికంగా ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan) నాయకత్వం వహించనున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన రషీద్ ఖాన్‌ కు మరోసారి భారీ బాధ్యతలు అప్పగించింది.. ప్రధానంగా సీనియర్ ఆల్ రౌండర్ గుల్బాదిన్ నైబ్ తిరిగి జట్టులో స్థానం సంపాదించుకోగా, భుజం గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్ పూర్తిగా కోలుకుని జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.

Read Also: Damien Martyn: కోమాలో ఆసీస్ దిగ్గజ బ్యాటర్?

టీ20 సిరీస్

స్పిన్ విభాగంలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ తిరిగి రావడంతో ఇటీవల ఆకట్టుకున్న యువ స్పిన్నర్ ఏఎం ఘజన్‌ఫర్‌ను రిజర్వ్ జాబితాలో చేర్చాల్సి వచ్చింది. వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ ఇషాక్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ షాహిదుల్లా కమల్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా ఆఫ్ఘ‌నిస్థాన్ జట్టు జనవరి 19 నుంచి 22 వరకు యూఏఈలో వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు కూడా ఇదే జట్టును ఎంపిక చేశారు. ఫిబ్రవరి 8న చెన్నై వేదికగా న్యూజిలాండ్‌తో ఆఫ్ఘ‌నిస్థాన్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.

This is Afghanistan's squad for the T20 World Cup 2026!
This is Afghanistan’s squad for the T20 World Cup 2026!

ఆఫ్ఘ‌నిస్థాన్ జట్టు:
రషీద్ ఖాన్ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్ (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), మొహమ్మద్ ఇషాక్ (వికెట్ కీపర్), సెదికుల్లా అటల్, దర్విష్ రసూలీ, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నైబ్, మొహమ్మద్ నబీ, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్, ఫజల్ హక్ ఫరూఖీ, అబ్దుల్లా అహ్మద్‌జాయ్.

రిజర్వ్ ప్లేయర్లు: ఏఎం ఘజన్‌ఫర్, ఇజాజ్ అహ్మద్‌జాయ్, జియా ఉర్ రెహ్మాన్ షరీఫి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870