భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన సహచర క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్‌లకు మద్దతుగా నిలిచారు.. రానున్నవరల్డ్ కప్‌లో వీరిద్దరూ కీలక పాత్ర పోషించి జట్టుకు విజయాలు అందిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో జరిగిన నిన్నటి మూడో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Read Also: Lionel Messi: మెస్సితో హ్యాండ్ షేక్‌కి రూ.కోటి?
శుభ్‌మన్‌తో నాకు చాలాకాలంగా పరిచయం ఉంది
ఈ మ్యాచ్‌లో గిల్ 28 పరుగులు చేయగా, సూర్యకుమార్ కేవలం 12 పరుగులకే ఔటయ్యాడు. అయితే, 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన అభిషేక్ శర్మ (Abhishek Sharma) , మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు.“ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా. నన్ను నమ్మండి. ప్రపంచకప్‌లోనూ, దానికి ముందు కూడా సూర్యకుమార్, శుభ్‌మన్ భారత్‌కు మ్యాచ్‌లు గెలిపిస్తారు. ముఖ్యంగా శుభ్‌మన్‌తో నాకు చాలాకాలంగా పరిచయం ఉంది.

ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ప్రత్యర్థి ఎవరైనా అతను రాణించగలడు. అతనిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. త్వరలోనే అందరికీ ఆ నమ్మకం కలుగుతుంది” అని అభిషేక్ పేర్కొన్నాడు.పిచ్ ఫాస్ట్ బౌలర్లకు కొద్దిగా అనుకూలించిందని, అందుకే పవర్‌ప్లేలోనే దూకుడుగా ఆడి మంచి ఆరంభం ఇవ్వాలని భావించానని అభిషేక్ తెలిపాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: