ప్రపంచ వ్యాప్తంగా క్రీడా రంగంలో (Sports) ఎంతో మంది స్టార్లు ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా విడుదలైన ఓ నివేదిక ప్రకారం అత్యధికంగా 76 దేశాల్లో రొనాల్డో గురించి నెటిజన్లు సెర్చ్ చేశారు.
Read Also: Harbhajan Singh: షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్
స్పెయిన్ ఫుట్‌బాల్ సెన్సేషన్, 18 ఏళ్ల లమిన్ యమల్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అతని గురించి 37 దేశాల్లో అత్యధికంగా సెర్చ్ చేశారు. 16 దేశాలతో లియోనల్ మెస్సీ మూడో స్థానంలో నిలవగా.. అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ 8 దేశాలతో నాలుగో స్థానం, ఫార్మూలా 1 రేసర్ మాక్స్ వెర్‌స్టాపెన్ 6 దేశాలతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. నెలవారి సెర్చ్ పరంగా 13.6 మిలియన్లతో రొనాల్డో టాప్‌లో ఉండగా..

అత్యధికంగా సెర్చ్ చేసిన ఆటగాళ్ల జాబితా
(Sports) జానిక్ సిన్నర్, కార్లోస్ అల్కరాజ్, లమిన్ యమాల్‌లో ఒక్కొక్కర్ని సగటున 9.14 మిలియన్ల నెలవారి సెర్చ్ చేశారు. ఇక, భారత్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. మరే ఇతర అంతర్జాతీయ క్రీడాకారుడు కూడా కోహ్లీని అందుకోలేకపోయారు. అత్యధికంగా సెర్చ్ చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ తర్వాత వైభవ్ సూర్యవంశీ నిలిచాడు.
ఈ 14 ఏళ్ల కుర్రాడు విధ్వంసకర బ్యాటింగ్‌తో టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారాడు. మహిళా క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధానలు తర్వాతి స్థానంలో నిలిచారు. మహిళల వన్డే ప్రపంచకప్ విజయంతో ఈ ఇద్దరి పేర్లు దేశవ్యాప్తంగా మారుమోగింది. అయితే ఈ సెర్చ్‌ల వివరాలను గూగుల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ నెల ఆఖర్లో గూగుల్ ఈ లిస్ట్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: