టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. దక్షిణాఫ్రికా (SA)తో జరగనున్న తొలి టెస్టు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గిల్ భారత జట్టు ప్రస్తుత బౌలింగ్ యూనిట్ గురించి, అలాగే సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami) గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Anirudh: న్యూయార్క్ వీధుల్లో కావ్యమారన్, అనిరుధ్ చెట్టపట్టాలు?

షమీ లాంటి బౌలర్లు చాలా అరుదు
షమీ లాంటి బౌలర్లు చాలా తక్కువ మంది ఉంటారని IND టెస్ట్ కెప్టెన్ గిల్ (Shubhman Gill)అన్నారు. ఆయన్ను ఎందుకు సెలక్ట్ చేయలేదు, ఫ్యూచర్‌లో చేస్తారా అనే ప్రశ్నలకు తనకంటే సెలక్టర్లే బెటర్‌గా సమాధానం ఇవ్వగలరని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతమున్న బౌలర్లు చాలా బాగా రాణిస్తున్నారని గుర్తుచేశారు. SAతో జరగనున్న తొలి టెస్టులో ఆల్‌రౌండర్ లేదా ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను ఆడించే విషయంపై రేపే నిర్ణయం తీసుకుంటామన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: