నేడు అబుదాబిలోని ఎతిహాద్ ఎరీనాలో జరగనున్న మినీ వేలం (IPL Auction) లో 10 ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి. మొత్తం 77 స్లాట్‌ల కోసం 359 మంది ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. వీరిలో 31 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అత్యధికంగా 13 స్లాట్‌లను, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) 10 స్లాట్‌లను భర్తీ చేసుకోవాల్సి ఉంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ ఈ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాడని, అతని కోసం రూ. 25 కోట్లకు పైగా ధర పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. లియామ్ లివింగ్‌స్టోన్, రవి బిష్ణోయ్ వంటి ఆటగాళ్లపై కూడా ఫ్రాంచైజీలు భారీగా ఖర్చు చేసే అవకాశం ఉంది.
Read Also: BCCI: విజయ్ హజారే ట్రోఫీకి జాతీయ ఆటగాళ్ల హాజరు తప్పనిసరి

77 మందిని కొనుగోలు చేసే ఛాన్స్
IPL మినీ వేలం (IPL Auction) లిస్టులో అభిమన్యు ఈశ్వరన్‌తో సహా 19 మంది ప్లేయర్లు చేరారు. దీంతో ఆక్షన్‌లో పాల్గొనే మొత్తం ఆటగాళ్ల సంఖ్య 369కి చేరింది. వేలానికి ముందు కొత్త ప్లేయర్లను చేర్చడం కొత్త విషయం కాకపోయినా ఇంతమంది యాడ్ కావడం ఇదే తొలిసారి అని BCCI తెలిపింది. నేడు గరిష్ఠంగా 77 మందిని కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఇవాళ 2.30PM నుంచి అబుదాబిలో ఆక్షన్ ప్రారంభం కానుంది. KKR పర్సులో అత్యధికంగా రూ.64.30CR ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: