భారత జట్టులో భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. జట్టు స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వైదొలిగాడు. వెన్ను నొప్పి కారణంగా ఈ ప్రిస్టేజియస్ ట్రోఫీ నుంచి తప్పుకోవాల్సొచ్చింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. వంద శాతం ఫిట్‌నెస్‌తో లేడని పేర్కొంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు గడువు సమీపిస్తోంది. ఈ నెల 19వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. మార్చి 9వ తేదీ వరకు కొనసాగుతుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దేశం పాకిస్తాన్‌తో తలపడనుంది న్యూజిలాండ్. మార్చి 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
దుబాయ్ వేదికగా
భారత్ సహా ఎనిమిది దేశాలు- పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఇందులో తలపడనున్నాయి. భారత్ ఆడబోయే మ్యాచ్‌లన్నీ కూడా తటస్థ వేదిక దుబాయ్‌లో జరుగనున్నాయి. మిగిలినవి- కరాచీ, లాహోర్, రావల్పిండిల్లో షెడ్యూల్ అయ్యాయి.

15- ప్లేయర్స్ టీమ్‌లో
గ్రూప్- ఎలో భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ . గ్రూప్ -బిలో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల బోర్డులు కూడా తమ జట్లను ప్రకటించాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే భారత జట్టును బీసీసీఐ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. మొత్తం 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టు ఇది. రోహిత్ శర్మ కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్ గా నియమితులయ్యారు. బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాకు చోటు లభించింది.15 మంది సభ్యులు గల టీమిండియా స్క్వాడ్‌లో. ఇటీవలే ఇంగ్లాండ్‌తో ముగిసిన టీ20 సిరీస్, తొలి రెండు వన్డేల్లో రాణించాడు రాణా. ఇంగ్లాండ్‌పై తొలి వన్డేలో ఏడు ఓవర్లల్లో మూడు వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. అదే అతని డెబ్యూ వన్డే ఇంటర్నేషనల్ కూడా. రెండో వన్డేలో ఒక వికెట్ తీసుకున్నాడు. అటు ఐపీఎల్, రంజీల్లో నిలకడగా రాణిస్తోండటంతో రాణాకు చోటు దక్కింది.
యశస్వి జైస్వాల్
డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకొన్నాడు. రిజర్వ్ ప్లేయర్‌గా మాత్రమే జట్టులో ఉంటాడు. ఇప్పటికే మహ్మద్ సిరాజ్, శివందుబే నాన్ ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్ల జాబితాలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా వారితో జత కట్టాడు యశస్వి జైస్వాల్. గాయం గానీ, అనారోగ్యానికి గానీ గురికాకపోయినప్పటికీ- దుబాయ్ పిచ్‌ను దృష్టిలో ఉంచుకుని బౌలర్‌ను తీసుకోవడమే దీనికి కారణం. మిస్టరీ స్పిన్నర్‌కు చోటు.. జైస్వాల్‌కు బదులుగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది బీసీసీఐ. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు వరుణ్ చక్రవర్తి. అటు టీ20ల్లో గానీ, ఇటు తొలి రెండు వన్డేల్లో గానీ ఇంగ్లాండ్ బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టిన బౌలర్ అతనే. ఇదే ఫామ్‌ను ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కంటిన్యూ చేయగలడని బీసీసీఐ అంచనా వేసింది.