బీసీసీఐ (BCCI) టీమ్ ఇండియా ఆటగాళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ పూర్తైన వెంటనే, జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనాలని బోర్డు (BCCI) స్పష్టం చేసింది. ముఖ్యంగా డిసెంబర్ 24 నుంచి ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీలో కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాలని ఆదేశించింది. ఈ నిర్ణయం భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనడం ద్వారా మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాలనేది బోర్డు ఉద్దేశం. ఈ నిర్ణయంతో విరాట్ కోహ్లీ 16 ఏళ్ల తర్వాత, రోహిత్ శర్మ 2018 తర్వాత ఈ టోర్నీలో ఆడే అవకాశం ఉంది.
Read Also: IND VS SA: భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిన సౌతాఫ్రికా – 118 పరుగుల లక్ష్యం

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: