ఇటీవల సౌతాఫ్రికాతో భారత్ ఆడిన మూడో వన్డేలో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) తన కెరీర్‌లోనే తొలి సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అయితే క్రీజులో కుదురుకునేందుకు ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో మరో ఎండ్‌లో ఉన్న రోహిత్ తనతో మాట్లాడుతూ భరోసా ఇచ్చినట్లు జైస్వాల్ (Yashasvi Jaiswal)తెలిపారు. ‘నేను రిస్క్ తీసుకుంటా. నువ్వు ప్రశాంతంగా టైం తీసుకొని ఆడు’ అని తనతో చెప్పినట్లు వివరించారు. ఇది తన గొప్ప హృదయానికి నిదర్శనం అని కొనియాడారు.
Read Also: Karnataka: చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లపై రేపు కేబినెట్ నిర్ణయం

భవిష్యత్తులో టీ20 ప్రపంచకప్ ఆడాలన్నది నా కల
బుధవారం జరిగిన ‘అజెండా ఆజ్ తక్’ సదస్సులో జైస్వాల్ మాట్లాడుతూ, “రోహిత్ భాయ్ మమ్మల్ని తిట్టిన ప్రతిసారీ అందులో చాలా ప్రేమ ఉంటుంది. నిజానికి ఆయన మమ్మల్ని తిట్టడం ఆపేస్తే… ‘ఏమైంది? ఎందుకు తిట్టడం లేదు? నేను చేసిన పనికి ఆయన బాధపడ్డారా?’ అని మాకు ఆందోళనగా ఉంటుంది” అని నవ్వుతూ చెప్పాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు ఉండటం తమలాంటి యువకులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని జైస్వాల్ తెలిపాడు.
“వారు తమ అనుభవాలను పంచుకుంటారు. ఆట గురించి చర్చిస్తారు. గతంలో వారు చేసిన పొరపాట్లను మేము చేయకుండా ఎలా ఆడాలో సలహాలిస్తారు. వాళ్లు జట్టులో లేనప్పుడు మేము వారిని చాలా మిస్ అవుతాం” అని తెలిపాడు. భవిష్యత్తులో టీ20 ప్రపంచకప్ ఆడాలన్నది తన కల అని, అవకాశం వస్తే భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని జైస్వాల్ తన మనసులోని మాటను బయటపెట్టాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: