భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇటీవల ముగిసిన క్రికెట్ సిరీస్ మైదానంలో ఆటతోనే కాకుండా కొన్ని వివాదాలతోనూ వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) ను ఉద్దేశించి టీమిండియా ఆటగాళ్లు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. తాజాగా ఈ ‘బౌనా’ (పొట్టివాడు అని అర్థం) వివాదంపై తెంబా బవుమా స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Read Also: Cricket Records: 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
తన ఎత్తును ఉద్దేశించి భారత ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ తర్వాత ఆ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు వచ్చి తనకు క్షమాపణ చెప్పారని ఆయన వెల్లడించాడు. ఇటీవల ముగిసిన పర్యటనపై ‘ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో’కు రాసిన ఒక వ్యాసంలో బవుమా ఈ విషయాలను పంచుకున్నాడు.”కోల్‌కతా టెస్టు సందర్భంగా నా గురించి వారి భాషలో వాళ్లు ఏదో అన్నారు.
ఆ తర్వాత సీనియర్ ఆటగాళ్లయిన రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వచ్చి క్షమాపణ చెప్పారు. వారు సారీ చెప్పే సమయానికి అసలు విషయం ఏంటో నాకు తెలియదు. మీడియా మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నాను. మైదానంలో జరిగినవి అక్కడే ఉండిపోతాయి. కానీ అన్న మాటలు మరచిపోలేం. వాటిని కక్షగా కాకుండా ప్రేరణగా, ఇంధనంగా వాడుకుంటాం” అని బవుమా (Temba Bavuma) తెలిపాడు.

బవుమా స్పందించాడు
అదే సమయంలో తమ జట్టు కోచ్ షుక్రి కాన్రాడ్ చేసిన ‘గ్రోవెల్’ (మోకరిల్లేలా చేయడం) వ్యాఖ్యలపైనా బవుమా స్పందించాడు. “మా కోచ్ ఆ పదం వాడటంపై కూడా విమర్శలు వచ్చాయి. ఆ మాట విన్నప్పుడు నాక్కూడా కాస్త ఇబ్బందిగా అనిపించింది. బహుశా ఆయన అంతకంటే మంచి పదం ఎంచుకుని ఉండాల్సింది.
ఆ తర్వాత ఆయనే స్వయంగా క్షమాపణ చెప్పడంతో ఆ వివాదం ముగిసింది” అని బవుమా స్పష్టం చేశాడు.దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో 25 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, వైట్ బాల్ సిరీస్‌లో పరాజయం పాలైంది. ఏదేమైనా, బుమ్రా, పంత్ తమ తప్పును తెలుసుకుని క్షమాపణలు చెప్పడం క్రీడా స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: