हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Temba Bavuma: రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

Anusha
Latest News: Temba Bavuma: రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారీ స్కోరు సాధించినప్పటికీ టీమిండియాకు ఓటమి తప్పలేదు. బుధవారం రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన బవుమా (Temba Bavuma) సమష్టి, ప్రదర్శనతో ఈ భారీ విజయం సొంతమైందని తెలిపాడు. ‘విజయాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది.

Read Also: Jerusalem Masters 2025: జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

ఈ మ్యాచ్‌‌లో బంతితో మెరుగైన ప్రదర్శన చేయాలని భావించాం. అందుకు తగ్గట్లుగానే మా బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేశారు. బ్యాటింగ్‌లో ఆరంభంలోనే మాకు మంచి భాగస్వామ్యం నెలకొల్పాల్సి వచ్చింది. ఎయిడెన్ మార్క్‌రమ్‌తో కలిసి ప్రదర్శన చేశాను. బ్రీట్జ్కే తన ఫామ్‌ను కొనసాగించగా.. కార్బిన్ బోష్ మెచ్యూర్ బ్యాటింగ్‌తో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

ఇది నమ్మశక్యం కానీ ఆట. రికార్డ్ ఛేజింగ్ అని నేను అనుకుంటున్నా. భారత జట్టుతో ఆడటం ఎంత కష్టమో ఈ రోజు మరోసారి అర్థమైంది. మార్క్‌రమ్ (Markrum) దూకుడుగా ఆడితే నేను అతనికి అండగా భాగస్వామ్యాన్ని నిర్మించే ప్రయత్నం చేశాను. ఏది ఏమైనా ఆటను చివరి వరకు తీసుకెళ్లాలని అనుకున్నాం. నేను కూడా ఆఖరి వరకు బ్యాటింగ్ చేయాలనుకున్నా. కానీ సాధ్యం కాలేదు.

Temba Bavuma: Second ODI victory.. This is the South African captain's response!
Temba Bavuma: Second ODI victory.. This is the South African captain’s response!

ఆఖరి వన్డేలో భర్తీ చేసే ఆటగాళ్లు మాకు ఉన్నారు

అయినప్పటికీ మంచి భాగస్వామ్యం నెలకొల్పాం. ఈ విజయం మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఇది మా అత్యుత్తమ టీమ్ అంటే అవుననే సమాధానం చెబుతాను. జట్టులో ఆటగాళ్ల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఉంది. బ్యాటర్లు వారి స్థానాల కోసం పోటీ పడుతున్నారు.క్వింటన్ డికాక్ రీఎంట్రీ ఇచ్చాడు. బౌలర్ల మధ్య కూడా అదే పరిస్థితి నెలకొంది.

ఇలాంటి ప్రదర్శనలు మా ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. డీ జోర్జి, బర్గర్ గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. నాండ్రే తన స్పెల్‌ను పూర్తి చేయలేకపోయాడు. టోనీ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే ఆఖరి వన్డేలో వారి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లు మాకు ఉన్నారు.’అని టెంబా బవుమా (Temba Bavuma) చెప్పుకొచ్చాడు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870