దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు ముందు టీమిండియా అనూహ్యమైన సమస్యను ఎదుర్కొంటోంది. రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరూ గాయాలతో బాధపడుతుండటంతో, భారత జట్టులో నాయకత్వంపై కొత్త చర్చ మొదలైంది.కోల్‌కతా టెస్టులో శుభ్‌మన్ గిల్ (Shubman Gill) మెడకు గాయమైంది. దీంతో అతడు వన్డే సిరీస్‌లో ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి.
Read Also: Mushfiqur Rahim: టెస్టులో ముష్ఫికర్ రహీమ్ అరుదైన ఘనత
మరోవైపు, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కూడా గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వీరిద్దరూ సిరీస్‌కు అందుబాటులో లేకపోతే జట్టు పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనే విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.ప్రస్తుతం తాత్కాలిక కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ ముందున్నారు.

తాత్కాలిక కెప్టెన్ ఎవరు?
ఇద్దరికీ ఐపీఎల్ (IPL) లో జట్లకు నాయకత్వం వహించిన అనుభవం ఉంది. రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు, అక్షర్ పటేల్ పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. జాతీయ జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం పరంగా చూస్తే రాహుల్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గతంలో అతను టెస్టుల్లో కూడా జట్టును నడిపించాడు.
అయితే, ఇటీవల కెప్టెన్సీ ఒక భారం అంటూ ఇటీవల రాహుల్ చేసిన వ్యాఖ్యలు అతడికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, సెలెక్టర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఉత్కంఠగా మారింది. అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రాహుల్‌కు బాధ్యతలు అప్పగిస్తారా లేక యువ ఆటగాడైన అక్షర్ పటేల్‌కు అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాలి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: