భారత్ – దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఈ సిరీస్ ఇరు జట్లకి కీలకంగా మారింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు.
Read Also: Andre Russell: రస్సెల్ అరుదైన ఘనత

ప్రత్యేక పూజలు
టీ20 క్రికెట్ మ్యాచ్ జరగడానికి కొన్ని గంటల ముందు భారత జట్టు (Team India) పూరీలోని జగన్నాథుడిని దర్శించుకుంది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మంగళవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ తన భార్య దేవీశా శెట్టితో కలిసి(Team India) ప్రత్యేక పూజలు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆటగాళ్లు ఆలయంలోకి ప్రవేశించారు. సూర్యకుమార్ యాదవ్ ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులను ‘జై జగన్నాథ్’ అంటూ పలకరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: