हिन्दी | Epaper

T20 world cup final 2026 : టీ20 ఫైనల్ ముందు అహ్మదాబాద్ స్టేడియానికి దిష్టి – వీడియో వైరల్

Sai Kiran
T20 world cup final 2026 : టీ20 ఫైనల్ ముందు అహ్మదాబాద్ స్టేడియానికి దిష్టి – వీడియో వైరల్

T20 world cup final 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకోవడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు న్యూజిలాండ్‌తో టైటిల్ పోరుకు సిద్ధమవుతోంది.

ఈ కీలక మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న నేపథ్యంలో అభిమానుల్లో టెన్షన్ కూడా కనిపిస్తోంది గతంలో ఇదే మైదానంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలు కారణంగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలో ఇద్దరు భారత అభిమానులు స్టేడియం బయట సరదాగా దిష్టి తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మైదానానికి చెడు దృష్టి తగలకుండా ఉండాలని భావిస్తూ వారు చేసిన ఈ చర్య ఇప్పుడు నెట్‌లో చర్చగా మారింది.

2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఇదే అహ్మదాబాద్ స్టేడియంలో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం అభిమానులకు ఇప్పటికీ బాధను మిగిల్చింది ఆ మ్యాచ్‌లో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరినా చివరి మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది.

Read Also: Jasprit Bumrah: బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

అదే విధంగా ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో కూడా భారత్ ఓడిన ఏకైక (T20 world cup final 2026) మ్యాచ్ ఇదే మైదానంలో దక్షిణాఫ్రికాతో జరిగినది కావడం గమనార్హం దీంతో ఈ మైదానం గురించి అభిమానుల్లో సెంటిమెంట్ ఏర్పడింది.

ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే వేదికపై జరగడంతో అభిమానులు కొంచెం టెన్షన్‌తో ఉన్నారు అయితే ఈసారి టీమిండియా గెలిచి గత అపశకునాన్ని చెరిపేయాలని అభిమానులు కోరుకుంటున్నారు

అభిమానులు చేసిన ఈ దిష్టి వీడియో సరదాగా కనిపించినా టీమిండియా విజయం కోసం వారు ఎంతగా ఆశపడుతున్నారో స్పష్టంగా తెలియజేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టీ20 ఫైనల్ ముందు అహ్మదాబాద్ స్టేడియానికి దిష్టి – వీడియో వైరల్

టీ20 ఫైనల్ ముందు అహ్మదాబాద్ స్టేడియానికి దిష్టి – వీడియో వైరల్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ వ్యూయర్‌షిప్ రికార్డ్

భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ వ్యూయర్‌షిప్ రికార్డ్

బుమ్రాకు దక్కని గుర్తింపు? నెట్టింట ఆసక్తికర చర్చ!

బుమ్రాకు దక్కని గుర్తింపు? నెట్టింట ఆసక్తికర చర్చ!

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

న్యూజిలాండ్‌తో అంత ఈజీ కాదు!

న్యూజిలాండ్‌తో అంత ఈజీ కాదు!

ఇంగ్లాండ్ ఆటతీరు చూసి షాకయ్యా: సూర్యకుమార్ యాదవ్

ఇంగ్లాండ్ ఆటతీరు చూసి షాకయ్యా: సూర్యకుమార్ యాదవ్

ఆస్ట్రేలియా రికార్డు బద్దలు కొట్టిన భారత్

ఆస్ట్రేలియా రికార్డు బద్దలు కొట్టిన భారత్

📢 For Advertisement Booking: 98481 12870