2026టీ20 సిరీస్ కోసం బీసీసీఐ (BCCI) భారత జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ ఎంపికలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కు వరల్డ్ కప్ టీమ్ లో చోటు దక్కలేదు. అతడిని వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడమే కాకుండా, ఏకంగా జట్టు నుంచే తొలగించారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా కొనసాగనుండగా, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (Akshar Patel) ను కొత్త వైస్ కెప్టెన్‌గా నియమించారు.
Read Also: Hardik Pandya: కెమెరామెన్‌కు హగ్ ఇచ్చి సారీ చెప్పిన హార్దిక్
భారత్-శ్రీలంక సంయుక్తంగా టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం
వికెట్ కీపర్ జితేశ్ శర్మ స్థానంలో మంచి ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌కు సెలక్టర్లు అవకాశం కల్పించారు. ఇషాన్ కిషన్ (Ishan Kishan) చివరి సారిగా 2023 నవంబర్‌లో చివరి మ్యాచ్ ఆడాడు. ఇటీవల ముస్తాక్‌అలీ ట్రోఫీలో చెలరేగడంతో జాతీయ జట్టులో చోటు దక్కింది.అదేవిధంగా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌లకు కూడా జట్టులో చోటు దక్కింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ జరుగనున్నది. భారత్-శ్రీలంక సంయుక్తంగా టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి.

ఇప్పటికే ఐసీసీ (ICC) వేదికలను ఖరారు చేసిన విషయం తెలిసిందే. టీమిండియా టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న ముంబయిలో యూఎస్‌ఏతో ఆడుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 12న నమీబియాతో ఢిల్లీలో ఆడుతుంది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతుంది. అనంతరం ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లోని భారీ నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో చివరి గ్రూప్ మ్యాచ్ ఆడుతుంది.
భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, రింకూ సింగ్.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: