T20 World Cup 2026: ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంపై విమర్శలు వస్తున్న తరుణంలో, టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్ అతనికి అండగా నిలిచారు. క్రికెట్‌లో ఫామ్ కోల్పోవడం అనేది ఒక సహజమైన ప్రక్రియ అని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంజూ పేర్కొన్నారు. అభిషేక్ శర్మపై జట్టు యాజమాన్యానికి, ఆటగాళ్లకు పూర్తి నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు.
Read Also: IND vs ENG: కోహ్లీ రికార్డు సమం చేసిన సంజూ శాంసన్
ఫైనల్లో చెలరేగవచ్చు.. ఒక్క ఇన్నింగ్స్ చాలు!
అభిషేక్ శర్మ సామర్థ్యం గురించి సంజూ మాట్లాడుతూ.. “అభిషేక్ తనదైన రోజున ఎంతటి విధ్వంసం సృష్టించగలడో మనందరికీ తెలుసు. ఆ రోజు వరల్డ్ కప్ ఫైనల్ కూడా కావచ్చు. ఒకట్రెండు మంచి షాట్లు తగిలితే చాలు, తిరిగి ఫామ్‌లోకి రావడం అతనికి పెద్ద కష్టమేమీ కాదు” అని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి క్రికెటర్ కెరీర్‌లో ఇలాంటి ఒడిదుడుకులు ఎదురవుతాయని, వాటిని అధిగమించి నిలబడటమే అసలైన క్రీడా స్ఫూర్తి అని ఆయన అభిప్రాయపడ్డారు.

టీ20 క్రికెట్ చాలా విచిత్రమైనది: తన వైఫల్యంపై సంజూ
గతంలో న్యూజిలాండ్ సిరీస్‌లో తన సొంత వైఫల్యాల గురించి కూడా సంజూ ఈ సందర్భంగా ప్రస్తావించారు. “ఆ సిరీస్ నాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. టీ20 క్రికెట్ చాలా విచిత్రమైనది, ఇక్కడ ఫలితాలు ఒక్క నిమిషంలో మారిపోతుంటాయి. అందుకే మైదానంలో నిలదొక్కుకోవడం ముఖ్యం” అని ఆయన చెప్పుకొచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: