వచ్చే ఏడాది జరగనున్న పురుషుల పొట్టి ప్రపంచకప్ క్రికెట్ (T20 World Cup 2026) అభిమానుల్లో అపారమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఈ మహోత్సవానికి ఆతిథ్యం ఇవ్వనుంది.. ఫిబ్రవరి 7న టోర్నీ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా రెండు దేశాల్లో కలిపి ఎనిమిది నగరాలను మ్యాచ్ వేదికలుగా ఎంపిక చేసారు.
Read Also: Kuldeep Yadav: తొలి రోజే సఫారీలకు చుక్కలు చూపించిన కుల్దీప్ యాదవ్
తాజాగా టోర్నీలో (T20 World Cup 2026) ఆడనున్న 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా చేసింది ఐసీసీ. ఆతిథ్య జట్లైన టీమిండియా, శ్రీలంక గ్రూప్ దశలో కఠిన ప్రత్యర్ధులతో తలపడనున్నాయి. ఈసారి కూడా దాయాదులైన భారత్, పాక్ ఒకే గ్రూప్‌లో ఉండడంతో మరో ఉత్కంఠ పోరుకోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పొట్టి వరల్డ్ కప్ నిర్వహణ పనుల్లో వేగం పెంచింది ఐసీసీ. టోర్నీకి సమయం దగ్గరపడుతున్నందున వేదికలను ఖరారు చేసిన ఐసీసీ శనివారం 20 జట్లను గ్రూప్‌లుగా విభించింది. ఒక్కదాంట్లో ఐదు చొప్పున నాలుగు గ్రూప్‌లను చేసింది. ఆతిథ్య దేశమైన టీమిండియా గ్రూప్‌లో పాకిస్థాన్ మాత్రమే పెద్ద జట్టు.

కఠిన సవాల్
కానీ, శ్రీలంక గ్రూప్‌లో ఆస్ట్రేలియా ఉండడంతో ఆ జట్టుకు కఠిన సవాల్ ఎదురవ్వనుంది. ఇక గ్రూప్ 3లో ఇంగ్లండ్, వెస్టిండీస్.. గ్రూప్ 4లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి టెస్టు క్రికెట్ ఆడే జట్లు ఉన్నాయి.
గ్రూప్ -1 : భారత్, పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా, యూఎస్‌ఏ.
గ్రూప్ -2 : శ్రీలంక, ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్.
గ్రూప్ -3 : ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ.
గ్రూప్ -4 : దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్, యూఏఈ, కెనడా.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: