పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వ్యవహార శైలిపై ఆ దేశ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తరచూ యూటర్న్ తీసుకునే పీసీబీ వైఖరి వల్ల అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ పరువు పోతుందని ఆయన మండిపడ్డాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 (T20 WC) లో భాగంగా భారత్–పాకిస్థాన్ మధ్య జరగనున్న హైఓల్టేజ్ మ్యాచ్ విషయంలో చోటుచేసుకున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమని కనేరియా వ్యాఖ్యానించాడు.
Read Also: T20 England vs West Indies : ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
పీసీబీ వైఖరిని నిలదీశారు
బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నామని ప్రకటించిన పాకిస్థాన్.. చివరకు ఐసీసీ చర్చలతో తలొగ్గింది. ఇతర దేశాల సూచనలతో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీరు ఇలానే ఉంటుందని, తాను ముందే చెప్పానని గుర్తు చేశాడు. పీసీబీ నిలకడలేని స్వభావాన్ని ఎండగట్టాడు.‘ప్రతిదానికి ఒక హద్దుంటుంది. ఈ డ్రామా ఇక్కడితో ఆగదని, వారు ఖచ్చితంగా తమ నిర్ణయాన్ని మార్చుకుంటారని నేను ముందే చెప్పాను. ఎందుకంటే వారు మాట మార్చడంలో నిపుణులు. యూటర్న్ స్పెషలిస్ట్‌లు.

నిర్ణయాలు మార్చుకునేవారిలో వీళ్లను మించి మరెవ్వరినీ చూడలేదు. ఒక సమయంలో ఒకటి చెబుతారు, మరుక్షణమే పూర్తిగా భిన్నమైనది చెబుతారు. పాకిస్థాన్ ఈ చర్యలను చూసి ప్రపంచమంతా నవ్వుతోంది.’ అని కనేరియా విమర్శలు గుప్పించాడు.పీసీబీ డ్రామాతో బంగ్లాదేశ్ సమస్యను ఐసీసీ పరిష్కరించింది. కానీ పాకిస్థాన్ బోర్డుకు బంగ్లాదేశ్ ఎప్పుడు సాయం చేసిందని కనేరియా నిలదీసాడు. ‘మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పెద్ద ప్రకటనలు చేశారు. కానీ ఇప్పుడేమైంది? అకస్మాత్తుగా మిమ్మల్ని ఆడేలా మార్చిందేమిటి?” అంటూ పీసీబీ వైఖరిని నిలదీశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: