అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసిన తాజా ఐసీసీ మహిళల టీ20 (Women’s T20) బౌలింగ్ ర్యాంకింగ్స్ లో, ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. భారత్‌కు చెందిన స్టార్ ఆల్‌రౌండర్ దీప్తీ శర్మను వెనక్కి నెట్టి, నంబర్ వన్ ర్యాంక్‌ను సదర్లాండ్ దక్కించుకోవడం భారత క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
Read also: Vaibhav Suryavanshi: రిషభ్ పంత్ రికార్డును బ్రేక్ చేసిన వైభవ్
అదరగొట్టిన అమ్మాయిలు
తాజా ర్యాంకింగ్స్ ప్రకారం, అన్నాబెల్ సదర్లాండ్ 736 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. దీప్తీ శర్మ 735 పాయింట్లతో స్వల్ప తేడాతో రెండో స్థానానికి పరిమితమైంది.భారత్ – శ్రీలంక మధ్య జరిగిన మహిళల టీ20 సిరీస్‌లో దీప్తీ శర్మ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది. సాధారణంగా స్థిరమైన బౌలింగ్‌తో పాటు కీలక సమయాల్లో వికెట్లు తీసే దీప్తీ, ఈ సిరీస్‌లో ప్రభావం చూపలేకపోయింది. దీని ఫలితంగానే ఆమె టాప్ ర్యాంక్‌ను కోల్పోయినట్లు తెలుస్తోంది..

ఈ సిరీస్ లో దుమ్ములేపిన భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ రెండు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్ కు చేరుకుంది. ఈ సిరీస్ లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాదిన షఫాలీ తన 6వ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఆల్ రౌండర్ ల ర్యాంకింగ్స్ హైదరాబాద్ క్రికెటర్ అరుంధతీ రెడ్డి సత్తాచాటింది. ఆల్ రౌండర్ల జాబితాలో ఆమె ఏకంగా 44 స్థానాలు ఎగబాకి 21వ స్థానానికి చేరుకుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: