ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026లో అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్ లో టీమ్ ఇండియా ప్రారంభంలోనే కష్టాల్లో పడింది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ కుప్పకూలినది, ప్రత్యేకంగా పవర్ ప్లేలో నాలుగు కీలక వికెట్లు కోల్పోయి 77 పరుగులకే ఆరుగురు ఆటగాళ్లు అవుట్ అయ్యారు. ఆ సమయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనకు ఇచ్చిన ఓ మెసెజ్‌ను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు.
Read Also: Suryakumar Yadav: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన సూర్య
మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సూర్య (Suryakumar Yadav).. గెలిచినప్పటికీ తప్పులను గుర్తించి సరిదిద్దుకోవాలి. మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సూర్య.. గెలిచినప్పటికీ తప్పులను గుర్తించి సరిదిద్దుకోవాలి. ఇంకా స్మార్ట్‌గా ఆడాల్సిన అవసరం ఉంది అని అన్నాడు. ఈ మ్యాచ్‌లో సూర్య అజేయంగా 84 పరుగులు చేసినప్పటికీ, భారత్ ఒక దశలో 77 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది.

కుటుంబంతో గడిపిన తర్వాత మళ్లీ ఆత్మవిశ్వాసం పెరిగింది
ఆ సమయంలో తనపై ఉన్న ఒత్తిడిని వివరిస్తూ “నేను చివరి వరకు క్రీజ్‌లో నిలబడితే మ్యాచ్‌ను మలుపు తిప్పగలనన్న నమ్మకం నాకుంది” అని సూర్య తెలిపాడు.పిచ్ పరిస్థితులపై స్పందించిన సూర్య, సరైన ఎండ లేకపోవడంతో మైదానంలో తేమ ఎక్కువగా ఉందని, అందుకే బ్యాటింగ్ కష్టంగా మారిందని చెప్పాడు. ఈ క్రమంలో 14 ఓవర్ల విరామ సమయంలో గంభీర్ తనతో మాట్లాడి ధైర్యం చెప్పాడని వెల్లడించాడు.
“గంభీర్ భాయ్ నాకు చివరి వరకు నిలబడి ఆడు.. ఏ సమయంలోనైనా స్కోర్ పెంచగలవు అని చెప్పాడు. ఆ మాటలు నాకు చాలా ధైర్యం ఇచ్చాయి” అని సూర్య వివరించాడు.తన గత ప్రదర్శనలపై కూడా స్పందించిన సూర్య (Suryakumar Yadav), గత ఏడాది నిలకడగా ఆడలేకపోయానని, కుటుంబంతో గడిపిన తర్వాత మళ్లీ ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పాడు. వాంఖడే మైదానంలో ఎక్కువగా ఆడిన అనుభవం తనకు ఉపయోగపడిందని పేర్కొన్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: