సొంతగడ్డపై సౌతాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాజయంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ను తొలగించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ పరాజయం అనంతరం మైదానంలోనే గంభీర్‌కు అభిమానుల నుంచి నిరసన సెగ తగిలింది.
Read Also: Smriti Mandhana: స్మృతి మంధాన కు జెమీమా అండ
జట్టు ఓడిపోయినప్పుడు కోచ్‌ను తప్పుపట్టడం అలవాటుగా మారింది
ఈ క్రమంలో టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. హెడ్‌కోచ్‌కు మద్దతుగా నిలిచారు. ఓటమికి కోచ్‌ను బాధ్యుడిని చేయడం అన్యాయమన్నారు. కోచ్ కోవలం జట్టును సిద్ధం చేయగలడని.. తన అనుభవంతో ఆటగాళ్లకు కేవలం సలహాలు మాత్రమే ఇవ్వగలడని.. మైదానంలో రాణించాల్సింది ఆటగాళ్లేనన్నారు. గంభీర్‌ను బాధ్యుడిని చేయాలని అడుగుతున్న వారికి తాను ఒకటే ప్రశ్న అడుగుతున్నానని.. గంభీర్ (Gautam Gambhir) కోచింగ్‌లో భారత్ చాంపియన్స్ ట్రోఫీ,

ఆసియా కప్ గెలిచినప్పుడు మీరేం చేశారని నిలదీశారు. అప్పుడు గంభీర్‌కు జీవితకాలం కాంట్రాక్ట్ ఇవ్వాలని అడిగారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. జట్టు ఓడిపోయినప్పుడు కోచ్‌ను తప్పుపట్టడం అలవాటుగా మారిందని గవాస్కర్ (Sunil Gavaskar) మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. భారత జట్టు దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచుల వన్డే, ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనున్నది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: