సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఈ సీజన్‌లో బయటి పిచ్లపై విజయం అందుకోలేని చెత్త రికార్డును కొనసాగిస్తోంది. తాజాగా ముంబై ఇండియన్స్‌తో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓడిన SRH, ఈ సీజన్‌లో బయట ఆడిన అన్ని మ్యాచుల్లో ఓటమిపాలైందని గమనించవచ్చు. కోల్కతా, వైజాగ్, ముంబై వంటి వేదికల్లో SRH మ్యాచ్‌లకు దిగినప్పటికీ, ఒక్కటిన్న కూడా గెలవలేకపోయింది. ఈ ఓటములు జట్టుకు తీవ్రమైన వెనుకడుగు కావడమే కాక, ప్లేఆఫ్ ఆశలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఉప్పల్ స్టేడియంలో మాత్రమే SRH దూకుడు
ఇదే సమయంలో, మిగతా అన్ని జట్లు బయటి వేదికల్లో కనీసం ఒక్క మ్యాచ్‌ను అయినా గెలిచి తమ బలాన్ని చాటుతున్నాయి. కానీ SRH మాత్రం స్వదేశం ఉప్పల్ స్టేడియంలో మాత్రమే విజయాలు నమోదు చేయగలగుతోంది. ఉప్పల్‌లో బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ ఉండటంతో SRH భారీ స్కోర్లు చేస్తోంది. ట్రావిస్ హెడ్, క్లాసెన్ వంటి డాషింగ్ ప్లేయర్లు అక్కడ మెరుపులు చూపుతున్నారు. అయితే అదే ఫామ్‌ను బయటి పిచ్లపై చూపించలేకపోవడం వల్ల జట్టు దెబ్బతింటోంది.

SRH బ్యాటర్లు ప్లాప్
ఈ నేపథ్యంలో, ఇతర జట్లు SRH బలాన్ని గుర్తించి, స్లో పిచ్లను సిద్ధం చేయడానికి మొగ్గు చూపుతున్నాయి. బ్యాటింగ్‌కు సహకరించని పిచ్లపై SRH బ్యాటర్లు తడబడిపోతుండటంతో, తక్కువ స్కోర్లు చేసి, ప్రత్యర్థి బౌలర్ల దాడికి తాళలేకపోతున్నారు. ఇది SRH పరాజయాల్లో ప్రధాన కారణంగా మారింది. అందువల్ల జట్టు యాజమాన్యం బయటి పిచ్లపై ప్రదర్శనను మెరుగుపరచే మార్గాలు వెతకాల్సిన అవసరం ఏర్పడింది. లీగ్‌లో నిలవాలంటే అన్ని పరిస్థితులకు తగినట్టు ఆడే సామర్థ్యం చూపాల్సిన సమయం ఆసన్నమైంది.