భారత క్రీడా రంగం (Sports) లో ప్రతిష్టాత్మకంగా భావించే అర్జున అవార్డుల నామినేషన్లలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు చోటు దక్కించుకోవడం రాష్ట్రానికి గర్వకారణంగా మారింది. డెఫ్ షూటర్ ధనుష్ శ్రీకాంత్, బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గాయత్రి ఈసారి అర్జున అవార్డుల కోసం నామినేట్ అయ్యారు.
Read Also: Rohit Sharma: విజయ్ హజారేలో హిట్‌మ్యాన్ హవా..

సెలెక్షన్ కమిటీ
దేశవ్యాప్తంగా (Sports) ఎంపికైన 24 మంది క్రీడాకారుల జాబితాలో తెలంగాణ నుంచి వీరిద్దరి పేర్లు చోటు దక్కడం విశేషంగా నిలిచింది. వినికిడి లోపం ఉన్నా డెఫ్ ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు సాధించిన ధనుష్, నిలకడగా రాణిస్తున్న గాయత్రి ప్రతిభను సెలెక్షన్ కమిటీ గుర్తించింది. ఈ జాబితాను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పరిశీలించి, రాష్ట్రపతి ఆమోదం తర్వాత అవార్డులు ప్రదానం చేస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: