భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) పెళ్లి మళ్లీ వాయిదా పడింది. నిన్న జరగాల్సిన వేడుకను ఆమె తండ్రికి హార్ట్‌అటాక్ రావడంతో నిలిపివేశారు. ప్రస్తుతం ఆయనను డాక్టర్లు అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇంతలో, స్మృతి మంధాన కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ కూడా అనారోగ్యానికి గురయ్యాడు. వైరల్ ఫీవర్‌తో పాటు ఎసిడిటీ పెరగడంతో అతడిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. చికిత్స అనంతరం ఆయనను డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది.

పెళ్లి షెడ్యూల్‌పై కొత్త సందిగ్ధత
ఇద్దరి కుటుంబాల్లో వరుస ఆరోగ్య సమస్యలు(Smriti Mandhana) తలెత్తడంతో పెళ్లి తేదీపై స్పష్టత లేకుండా పోయింది. కొత్త తేదీ ఎప్పుడు ఖరారు చేస్తారనే విషయంలో అధికారిక ప్రకటన కోసం అభిమానులు, క్రికెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: