మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ తో కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న స్మృతి మంధాన ఇటీవల (Smriti Mandhana) పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్దమైంది. గతనెల 23న వివాహానికి ముంబైలో ఏర్పాట్లు కూడా జరిగాయి. సంగీత్, మెహందీ వేడుకలు ఘనంగా జరగగా.. చివరి నిమిషంలో వివాహం ఆగిపోయింది.స్మృతి తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు ఆమె మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, శ్రీనివాస్ మంధాన కోలుకుని ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత కూడా వివాహానికి సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
Read Also: Virat Kohli: ధోనీ, ఏబీడీ రికార్డ్స్ బ్రేక్ చేసిన కోహ్లీ

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలిపింది
అయితే, వారాల తరబడి నెలకొన్న ఊహాగానాలపై స్మృతి మంధాన తొలిసారిగా తన మౌనం వీడింది. తన పెళ్లి క్యాన్సిల్ అయిందని క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అధికారికంగా ప్రకటించారు. స్మృతి మంధాన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. తమ కుటుంబాలు ఈ వివాహాన్ని రద్దు చేశాయని ఆమె స్పష్టం చేసింది.
“గత కొన్ని వారాలుగా నా జీవితంపై ఎన్నో వదంతులు వస్తున్నాయి. నా పెళ్లి క్యాన్సిల్ అయిందని క్లారిటీ ఇస్తున్నా. నేను ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నా. మీరూ నాలాగే వదలేయండి. ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇండియా తరఫున ఎన్నో ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యం” అని స్మృతి మంధాన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: