Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ ఐకాన్ స్మృతి మంధానా ఖాతాలో మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం వచ్చి చేరింది. ప్రముఖ టాయ్ తయారీ సంస్థ మాట్టెల్ (Mattel) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకటించిన తమ ప్రతిష్టాత్మక “బార్బీ డ్రీమ్ టీమ్”లో మంధానాను ఎంపిక చేసింది. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోని మొట్టమొదటి క్రికెటర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఆమె రూపాన్ని పోలి ఉండే ఒక ప్రత్యేకమైన బార్బీ డాల్‌ను కూడా కంపెనీ ఆవిష్కరించింది.
Read Also: Nara Lokesh: సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి సందడి.. హాజరైన లోకేశ్ దంపతులు
మహిళా క్రీడాకారిణిలకు స్ఫూర్తిగా స్మృతి
మందానా ఎంపిక మహిళల క్రీడల అభివృద్ధికి ప్రతీకగా నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆమె సాధించిన విజయాలను గుర్తిస్తూ ఈ ప్రత్యేక బార్బీ డాల్‌ను రూపొందించారు.
ఈ కార్యక్రమం ద్వారా వివిధ రంగాల్లో గొప్ప విజయాలు సాధించిన మహిళలను గౌరవించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన మహిళల జాబితాలో భారతదేశాన్ని స్మృతి మంధానా ప్రతినిధిగా నిలిచింది.
బార్బీ డ్రీమ్ టీమ్‌లో ఉన్న ఇతర ప్రముఖులు..
బార్బీ తమ అధికారిక ప్రకటనలో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది మంది మహిళలను డ్రీమ్ టీమ్‌లో ఎంపిక చేసింది. ఈ లిస్ట్ లో ఎవరెవరున్నారో ఓసారి చూద్దాం..
సెరీనా విలియమ్స్ (Serena Williams) (టెన్నిస్ దిగ్గజం)
కెల్లీ గెరార్డి (Kellie Gerardi) (రీసెర్చ్ ఆస్ట్రోనాట్ / పరిశోధక వ్యోమగామి)
రెజినా సిర్వెంట్ అల్వరాడో (Regina Sirvent Alvarado) (ప్రొఫెషనల్ రేస్ కార్ డ్రైవర్)
క్లోయీ కెల్లీ (Chloe Kelly) (ఫుట్‌బాల్ క్రీడాకారిణి)
హెలెన్ ఫిషర్ (Helene Fischer) (పాప్ కళాకారిణి)
జోజా స్కుబిస్ (Zoja Skubis) (ఎక్స్‌పెడిషన్ క్లైంబర్ / పర్వతారోహకురాలు)
స్టెఫానీ గిల్మోర్ (Stephanie Gilmore) (ప్రొఫెషనల్ సర్ఫర్)
స్మృతి మంధాన (Smriti Mandhana) (భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి)
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: