భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) వ్యక్తిగత జీవితంలోని కష్టకాలం నుంచి బయటపడి, తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. శ్రీలంకతో ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు ఆమె భారత జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. కాగా, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌తో తన వివాహం రద్దయిన తర్వాత తొలిసారి ఆమె బుధవారం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Also: Karnataka: చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లపై రేపు కేబినెట్ నిర్ణయం
స్మృతి మంధాన (Smriti Mandhana) మాట్లాడుతూ, వ్యక్తిగత జీవితం కారణంగా కష్టకాలాన్ని ఎదుర్కొన్నా, ఇప్పుడు మళ్లీ పూర్తిగా క్రికెట్‌పైనే ఫోకస్ పెట్టానని, స్పష్టంగా చెప్పింది. “నిజం చెప్పాలంటే, నాకు క్రికెట్ కంటే ఎక్కువగా ఇష్టమైనది మరేదీ, లేదు. ఇండియా జెర్సీ వేసుకున్నప్పుడు మనస్సులో ఇతర ఆలోచనలు ఉండవు. దేశం కోసం మ్యాచ్ గెలిపించాలన్న కోరికే ఉంటుంది.”

అలాగే జట్టులో తలెత్తే భేదాభిప్రాయాల గురించి మాట్లాడుతూ “అది ఇష్యూ కాదు. మనందరం గెలవాలని భావిస్తాం. వాదోపవాదాలు లేకపోతే ప్యాషన్ లేనట్టే. అవి కూడా ఉండాలి, అవే మైదానంలో విజయానికి దారితీస్తాయి.” అని చెప్పింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: