టీమిండియాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్, ఫారమ్‌లో ఉన్న స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) గాయం కారణంగా ఆసుపత్రిలో చేరాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్ సందర్భంగా ఒక సందర్భంలో పక్కటెముకకు తీవ్రమైన గాయం కావడంతో అతని ఆరోగ్యం అతడు, ప్రస్తుతం సిడ్నీలోని ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
Read Also: IND Vs AUS: T20 సిరీస్.. టీమిండియాలో భారీ మార్పులు
మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ కారీగా క్యాచ్ తీసుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. బ్యాక్‌వర్డ్ పాయింట్ ప్రాంతం వైపు వెనక్కి స్ప్రింట్ చేస్తూ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు శ్రేయాస్ (Shreyas Iyer). అయితే అదే సమయంలో అతని ఎడమ పక్కటెముక లో తీవ్రమైన దెబ్బ తగిలింది. ఈ దృశ్యం కెమెరాల్లో స్పష్టంగా అయ్యింది..
శనివారం డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వచ్చిన వెంటనే టీం డాక్టర్, ఫిజియో ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా.. వెంటనే అతన్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.శ్రేయాస్ హెల్త్ పై ఓ వ్యక్తి నేషనల్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘శ్రేయాస్ గత రెండు రోజులుగా ఐసియు (ICU) లో ఉన్నాడు.
క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం
రిపోర్ట్స్ వచ్చిన తర్వాత.. అంతర్గత రక్తస్రావం అయినట్లు గుర్తించారు. రక్తస్రావం కారణంగా ఇన్ఫెక్షన్ (Infection) వ్యాప్తి చెందకుండా ఉండటానికి దాదాపు 2 నుంచి 7 రోజుల వరకు డాక్టర్ల పర్యావేక్షణలో ఉంటాడు’’ అని నేషనల్ మీడియాకు తెలిపారు.మొదట్లో అయ్యర్ దాదాపు మూడు వారాల పాటు ఆటకు దూరంగా ఉంటారని భావించారు.
కానీ గాయం పెద్దది కావడంతో ఇప్పుడు కోలుకునే కాలం ఎక్కువ కావచ్చని తెలుస్తోంది. క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం.. అంతర్గత రక్తస్రావం జరిగినందున, శ్రేయాస్ కోలుకోవడానికి ఖచ్చితంగా ఎక్కువ సమయం పడుతుంది. ఈ సమయంలో అతను పోటీ క్రికెట్‌కు తిరిగి రావడానికి ఖచ్చితమైన సమయం చెప్పడం కష్టం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: