భారత క్రికెట్ జట్టు సీనియర్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) ప్రశంసల వర్షం కురిపించాడు. వీరిద్దరినీ జట్టు నుంచి తప్పించాలనే వాదనలను అఫ్రిది కొట్టిపారేశాడు. విరాట్, రోహిత్ భారత జట్టుకు వెన్నెముక వంటి వారని, 2027 ప్రపంచకప్ వరకు వాద్దరినీ కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భారత జట్టుకు మాత్రమే కాకుండా, ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన వన్డే బ్యాట్స్‌మెన్‌లలో ఒకరని అఫ్రిది (Shahid Afridi) అన్నారు.
Read Also: IPL 2026: IPL మినీ వేలం.. 350 మందితో ఫైనల్ లిస్ట్
కోహ్లీ, రోహిత్‌లను భారత్ ముఖ్యమైన టోర్నమెంట్‌లలో, కీలక సిరీస్‌లలో తప్పకుండా ఆడించాలని అఫ్రిది సలహా ఇచ్చారు. అయితే భారత జట్టు బలహీనమైన ప్రత్యర్థితో ఆడుతున్నప్పుడు, యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చేందుకు వారిద్దరికీ విశ్రాంతి ఇవ్వవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివల్ల కీలక ఆటగాళ్లు పెద్ద టోర్నీలకు పవర్పుల్ గా ఉండవచ్చని సూచించారు.
“విరాట్, రోహిత్ భారత బ్యాటింగ్ లైనప్‌కు మూలస్తంభాలు అన్నది వాస్తవం. ఇటీవలి వన్డే సిరీస్‌లలో వారి ప్రదర్శన చూశాక, వారు 2027 ప్రపంచకప్ వరకు ఆడగలరని నమ్మకంగా చెప్పవచ్చు” అని అఫ్రిది పేర్కొన్నాడు.ఈ సందర్భంగా భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై అఫ్రిది విమర్శలు గుప్పించాడు.

రోహిత్ బ్యాటింగ్ క్లాస్ చూసి అప్పుడే ఇంప్రెస్ అయ్యా
“గంభీర్ తన కోచింగ్ బాధ్యతలు స్వీకరించినప్పుడు, తాను చెప్పిందే సరైందని, తాను అనుకున్నదే జరగాలని భావించినట్లు అనిపించింది.అని వ్యాఖ్యానించాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డును రోహిత్ శర్మ అధిగమించడంపై అఫ్రిది సంతోషం వ్యక్తం చేశాడు.
“రికార్డులు అనేవి బద్దలు కొట్టడానికే ఉంటాయి. నాకు ఎంతో ఇష్టమైన ఆటగాడు నా రికార్డును బ్రేక్ చేయడం ఆనందంగా ఉంది” అని అన్నారు. 2008 ఐపీఎల్ సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున రోహిత్‌తో కలిసి ఆడిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ, “అతని బ్యాటింగ్ క్లాస్ చూసి అప్పుడే ఇంప్రెస్ అయ్యాను. రోహిత్ కచ్చితంగా భారత్‌కు ఆడతాడని నాకు అప్పుడే తెలుసు” అని అఫ్రిది వివరించాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: