భారత మహిళా క్రికెటర్ షఫాలి వర్మ నవంబర్ 2025 నెలకు ఐసీసీ (ICC) మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును దక్కించుకుంది. నవీ ముంబైలో జరిగిన ఐసీసీ (ICC) మహిళల క్రికెట్ వరల్డ్ కప్ 2025 ఫైనల్‌లో చూపిన అద్భుత ప్రదర్శన వలన, ఈ గౌరవం లభించింది.. ఫైనల్ మ్యాచ్‌లో షఫాలి 87 పరుగులు చేసి, 2 కీలక వికెట్లు తీసింది.
Read Also: Tilak Varma: విరాట్ రికార్డ్ బ్రేక్ చేసిన తిలక్ వర్మ

ప్రతి ఒక్కరికీ అంకితం చేస్తున్నాను
అవార్డు అందుకున్న అనంతరం షఫాలి స్పందిస్తూ.. “నా తొలి వరల్డ్ కప్ అనుభవం ఆశించిన విధంగా మొదలుకాలేదు. కానీ, చివరికి నేను ఊహించనంత గొప్ప ముగింపు లభించింది. ఫైనల్లో జట్టు విజయంలో భాగస్వామ్యమయ్యే అవకాశం రావడం నా అదృష్టం. ఈ అవార్డును నా సహచరులు, కోచ్లు, కుటుంబ సభ్యులు, నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అంకితం చేస్తున్నాను. అని తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: