క్రికెట్ అభిమానులను ఉత్సాహపరిచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రతి సీజన్ ముందే ట్రేడింగ్ మార్కెట్లో కొత్త ట్విస్టులు, మార్పులతో హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. ఇక 2026 సీజన్‌కు ముందు ట్రేడింగ్ మార్కెట్‌లో, రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్, వికెట్ కీపర్-బ్యాటర్ అయిన సంజూ శాంసన్ ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Read Also: Novak Djokovic: నొవాక్ జకోవిచ్ అరుదైన ఘనత
ధోనీ వారసుడిగా సంజూ?
సంజూ శాంసన్ (Sanju Samson) కోసం సీఎస్కే.. రాజస్థాన్ రాయల్స్‌తో జరుపుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్ ముగిసిన వెంటనే సంజూ శాంసన్ తదుపరి సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడబోవడం లేదని వార్తలు రావడం మొదలయ్యాయి. ఈ ఊహాగానాలు ఇప్పుడు నిజమయ్యే దిశగా పయనిస్తున్నాయి.
ఓ నివేదిక ప్రకారం..ఈ ట్రేడింగ్ డీల్ చివరి దశలో ఉందని, త్వరలోనే ఫ్రాంచైజీల నుంచి దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.ఆ నివేదికలో ఈ డీల్ గురించి మరింత సంచలన విషయం వెల్లడైంది. సంజూ శాంసన్ (Sanju Samson) ను దక్కించుకోవడానికి సీఎస్కే తమ జట్టులోని ఇద్దరు ముఖ్య ఆటగాళ్లతో ట్రేడ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

సీఎస్కే అభిమానులకు ఓ పెద్ద షాక్
సంజూ శాంసన్ కోసం సీఎస్కే (CSK) తమ దిగ్గజ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్‌లను రాజస్థాన్ రాయల్స్‌కు అప్పగించనుంది. ఇది ఐపీఎల్ (IPL) చరిత్రలోనే రికార్డ్ బ్రేకింగ్ ట్రేడ్ డీల్‌గా నిలిచే అవకాశం ఉంది.గతంలో సంజూ శాంసన్ ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి ట్రిస్టన్ స్టబ్స్‌తో ట్రేడ్ అవుతాడనే వార్తలు వచ్చినా..
ఇప్పుడు సీఎస్కే డీల్‌కు దాదాపుగా అంగీకారం తెలిపినట్టు సమాచారం. రవీంద్ర జడేజా రాజస్థాన్ జట్టులోకి వెళ్లడమనేది సీఎస్కే అభిమానులకు ఓ పెద్ద షాక్. ఎందుకంటే రవీంద్ర జడేజా ధోనీకి అత్యంత నమ్మకమైన ఆటగాడు. అయితే సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్‌ను దక్కించుకోవాలంటే రవీంద్ర జడేజాను వదులుకోవడానికి సీఎస్కే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: