గత సీజన్ వరకు రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) కు కెప్టెన్‌గా చేసిన సంజూ శాంసన్ (Sanju Samson) వచ్చే సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తో ఆడనున్నాడు. ప్రస్తుతం ఉన్న 18 కోట్ల ధరకే అతను జట్టు మారాడు. ఐపీఎల్‌లో సుమారు 177 మ్యాచ్‌లు ఆడాడు సంజూ. 2013లో అతను ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. 2016, 2017 సీజన్లలో మాత్రం అతను ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు.
Read Also: IND vs SA: కోల్‌కతా టెస్టులో.. భారత్ ఆలౌట్

ధోనీ తర్వాత జట్టు పగ్గాలు ఎవరికన్న ప్రశ్న
ఇకపోతే, చెన్నై సూపర్ కింగ్స్‌లోకి సంజూ శాంసన్ (Sanju Samson) రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ధోనీ (Dhoni) తర్వాత జట్టు పగ్గాలు ఎవరికన్న ప్రశ్నకు సమాధానంగానే సంజూను జట్టులోకి తీసుకున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ధోనీ నుంచి రుతురాజ్ (Ruturaj) కు ఆ బాధ్యతలిచ్చారు. మళ్లీ MSDనే కెప్టెన్ చేశారు. అయితే ఈ సమస్యకు సంజూనే శాశ్వత పరిష్కారమని విశ్లేషకులూ భావిస్తున్నారు. అటు జట్టు భవిష్యత్తు కోసం జడేజానూ CSK త్యాగం చేసిందంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: