ఇంగ్లండ్‌కు చెందిన ప్రతిభావంతుడు ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ (Sam Curran) ఎన్నాళ్లుగానో ప్రేమలో ఉన్న తన స్నేహితురాలు ఇసాబెల్లె సైమండ్స్ విల్మాట్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు.ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల సామ్ కర్రన్‌ను రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) చెన్నై సూపర్ కింగ్స్‌కు బదిలీ చేసింది.
Read Also: Lakshya Sen: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టైటిల్‌ను గెలుచుకున్న లక్ష్య సేన్
ఇసాబెల్లె థియేటర్ ఆర్టిస్ట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (IPL 2026) సీజన్‌లో కొత్త ఫ్రాంచైజీ తరఫున బరిలోకి దిగనున్నాడు. సామ్ కర్రాన్ (Sam Curran) కాబోయే భార్య ఇసాబెల్లె సైమండ్స్ విల్మాట్ లండన్‌క్ చెందిన యువతి. ఇసాబెల్లె, సామ్ కర్రాన్ గతంలో శ్రీలంకలో సర్ఫింగ్ చేస్తూ, సఫారీని ఆస్వాదిస్తూ ఇద్దరూ, కనిపించారు. ఇసాబెల్లె ఇన్‌స్టాగ్రామ్ బయో ప్రకారం..
ఆమె ఫ్రొఫెషనల్ థియేటర్ ఆర్టిస్ట్. సామ్ కర్రన్ నిశ్చితార్థం ఇసాబెల్లెతో గత గురువారం జరిగింది. అయితే, శనివారం సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేస్తూ విషయాన్ని ప్రకటించాడు.కర్రాన్ ఇంగ్లండ్ తరఫున 24 టెస్టులు ఆడి.. 815 పరుగులు చేసి.. 45 వికెట్లు పడగొట్టాడు. ఇక 38 వన్డేలు ఆడి.. 637 పరుగులు చేసి 35 వికెట్లు తీశాడు. 64 T20టీల్లో 450 పరుగులు చేసి 57 వికెట్లు తీశాడు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: