వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ గాయపడ్డాడు. ఈ సంఘటన మూడో రోజు ఆటలో అతని ఫీల్డింగ్‌లో పాల్గొనకపోవడానికి కారణమైంది. కానీ, గాయం తీవ్రమైనది కాదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) (BCCI) స్పష్టం చేసింది. సాయి సుదర్శన్ (Sai Sudarshan) త్వరలో మళ్లీ ఫీల్డింగ్‌కు, బ్యాటింగ్‌కు సిద్ధం అవుతాడని తెలిపింది.
Yograj Singh: ప్రజలు నన్ను పిచ్చివాడని పిలిచారు: యోగరాజ్ సింగ్
సాయి సుదర్శన్ (Sai Sudarshan) తాజా ఫామ్లో ఉన్న యువ బ్యాటర్. అతను ఈ టెస్టు సిరీస్‌లో మంచి ప్రదర్శన ఇవ్వడం కోసం సన్నద్ధమవుతున్నాడు. మూడో రోజు ఆటలో గాయంతో ఫీల్డింగ్‌కు దూరమయ్యడం, అతని అభిమానులకు కొంత ఆందోళన కలిగించింది.న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
రవీంద్ర జడేజా (Ravindra Jadeja) బౌలింగ్‌లో వెస్టిండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ కొట్టిన షాట్‌ను ఫార్వర్డ్ షార్ట్ లెగ్ వద్ద సాయి సుదర్శన్ అందుకున్నాడు. బంతి వేగంగా వచ్చి మొదట అతని హెల్మెట్‌కు తగిలినా, ఏమాత్రం పట్టు జారనీయకుండా క్యాచ్ పూర్తి చేశాడు.

అతని చేతికి బలంగా దెబ్బ తగలడంతో
అయితే, ఈ క్రమంలో అతని చేతికి బలంగా దెబ్బ తగలడంతో వెంటనే మైదానం వీడాల్సి వచ్చింది. అతడి స్థానంలో దేవదత్ పడిక్కల్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చాడు.ఈ విషయంపై బీసీసీఐ (BCCI) తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. “రెండో రోజు క్యాచ్ పట్టే క్రమంలో సాయి సుదర్శన్ చేతికి దెబ్బ తగిలింది.
ముందుజాగ్రత్త చర్యగా అతను మూడో రోజు ఫీల్డింగ్‌కు రాలేదు. గాయం తీవ్రమైనది కాదు, అతను బాగానే ఉన్నాడు. బీసీసీఐ (BCCI) వైద్య బృందం అతడిని నిరంతరం పర్యవేక్షిస్తోంది” అని బోర్డు ఆ ప్రకటనలో తెలిపింది.ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే.
165 బంతుల్లో 12 బౌండరీలతో 87 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ (175)తో కలిసి రెండో వికెట్‌కు 193 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129 నాటౌట్) శతకంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 518/5 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ప్రస్తుతం మ్యాచ్‌పై భారత్ పూర్తి పట్టు సాధించి సిరీస్ క్లీన్‌స్వీప్ దిశగా సాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: