గత నాలుగేళ్లుగా భారత టెస్టు జట్టులో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాకపోవడంపై బెంగాల్ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Easwaran) తండ్రి రంగనాథన్ ఈశ్వరన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ముగిసిన ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అభిమన్యు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ, తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఈ నిర్ణయంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా సాయి సుదర్శన్‌కు అవకాశం కల్పించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.రంగనాథన్ ఈశ్వరన్ ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,సాయి సుదర్శన్ (Sai Sudarshan) ప్రదర్శనను గణాంకాలతో సహా విమర్శించారు.”మూడో స్థానంలో నా కొడుకును ఆడించి ఉండవచ్చు. సాయి సుదర్శన్‌పై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు.
దేశవాళీ రికార్డులే
కానీ అతను సాధించిన పరుగులు ఎన్ని? 0, 31, 0, 61… ఈ స్కోర్లకు బదులుగా, నా కొడుకు అభిమన్యుకు అవకాశం ఇచ్చి ఉండవచ్చు” అని అభిమన్యు తండ్రి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తన కొడుకు అభిమన్యుకు ఉన్న అనుభవాన్ని ప్రస్తావించారు. “నా కొడుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వంటి ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై 30% మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఎక్కువసేపు క్రీజులో నిలిచి ఇన్నింగ్స్‌ను నిర్మించగల ఆటగాడు అభిమన్యు అని అతని దేశవాళీ రికార్డులే చెబుతాయి” అని ఆయన ఘాటుగా వివరించారు.సాయి సుదర్శన్‌తో పాటు జట్టులో ఆడిన కరుణ్ నాయర్ (Karun Nair) ఎంపికను కూడా రంగనాథన్ ఈశ్వరన్ ప్రశ్నించారు. “కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్‌లో ఎప్పుడూ 4 లేదా 5వ స్థానంలో ఆడేవాడు. అలాంటి ఆటగాడిని అకస్మాత్తుగా మూడో స్థానంలో ఎలా ఆడించారు? 4, 5వ స్థానాల్లో ఆడే ఆటగాళ్లందరూ టాప్ ఆర్డర్ బ్యాటర్లుగా మారిపోతున్నారు.

నువ్వు సరైన మార్గంలోనే ఉన్నావు
కానీ నా కొడుకు ఒక స్పెషలిస్ట్ టాపార్డర్ బ్యాట్స్‌మెన్. అతను ఓపెనర్‌గా మాత్రమే ఆడగలడు” అని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని తప్పుపట్టారు.అయితే, భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ తన కొడుకుకు ఆశలు కల్పించినట్లు రంగనాథన్ ఈశ్వరన్ తెలిపారు. “గౌతమ్ గంభీర్ నా కొడుకుతో మాట్లాడుతూ, ‘నువ్వు సరైన మార్గంలోనే ఉన్నావు. నీకు తప్పకుండా అవకాశం వస్తుంది. ఒకటి, రెండు మ్యాచ్‌లతోనే నేను నిన్ను జట్టు నుండి తొలగించే వ్యక్తిని కాదు. నీకు ఎక్కువ అవకాశాలు ఇస్తాను’ అని హామీ ఇచ్చాడు” అని తెలిపారు. అభిమన్యు ఈశ్వరన్ దేశవాళీ క్రికెట్‌లో 103 మ్యాచ్‌లలో 48.70 సగటుతో 27 సెంచరీలు సహా మొత్తం 7841 పరుగులు సాధించాడు.తన కొడుకు 23 సంవత్సరాల కఠోర శ్రమకు తప్పకుండా ఫలితం లభిస్తుందని రంగనాథన్ ఈశ్వరన్ నమ్మకం వ్యక్తం చేశారు.
సాయి సుదర్శన్ ఏ ఫార్మాట్‌ల్లో ఆడుతారు?
ఆయన ఫస్ట్‌క్లాస్, లిస్ట్-ఎ, టీ20 ఫార్మాట్‌ల్లో ఆడుతున్నారు.
సాయి సుదర్శన్ IPLలో ఏ జట్టు తరపున ఆడుతున్నారు?
ఆయన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో గుజరాత్ టైటాన్స్ జట్టు తరపున ఆడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: